News March 1, 2025

గొలుగొండ: మేడ పైనుంచి జారిపడి వ్యక్తి మృతి

image

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో శనివారం ఉదయం ఓ వ్యక్తి  మృతి చెందాడు.  సీహెచ్.నాగపురం గ్రామానికి చెందిన మరిసా కృష్ణ ప్రమాదవశాత్తు ఇంటి మేడ పైనుంచి కింద పడి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. 

Similar News

News March 1, 2025

మోడల్‌ స్కూల్ ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

మోడల్ స్కూల్లో 2025 – 26 సంవత్సరానికి సంబంధించి 6 – 10 తరగుతుల్లో అడ్మిషన్లకు మార్చ్ 10వ తేదీ వరకు అవకాశం ఉందని కోమటిపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ విజయ లక్ష్మి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… https:///telanganams.cgg.gov.in వెబ్‌సైట్‌లో నేరుగా దరఖాస్తు తీసుకోవచ్చు అన్నారు. ఏప్రిల్‌ 13న దరఖాస్తు చేసిన వారికి పాఠశాలలోనే ప్రవేశ పరీక్ష ఉంటుందని చెప్పారు.

News March 1, 2025

PDPL: టాస్క్ ద్వారా వివిధ కోర్సుల ద్వారా శిక్షణ జిల్లా కలెక్టర్

image

టాస్క్ ద్వారా వివిధ కోర్సుల శిక్షణకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతున్నాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ విద్యార్థులకు ఇటీవల రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రారంభించిన నైపుణ్యాభివృద్ధి కేంద్రం టాస్క్ ద్వారా వివిధ కోర్సులకు సంబంధించి శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నామన్నారు. పూర్తి వివరాలకు పెద్దపల్లి ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలోని టాస్క్ ఆఫీసులో సంప్రదించాలన్నారు.

News March 1, 2025

సిరిసిల్ల: విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి: ప్రవీణ్

image

ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని బీమ్ ఆర్మీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దొబ్బల ప్రవీణ్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం డీఈఓ కు వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.

error: Content is protected !!