News January 14, 2026

గొల్లపల్లి: గంజాయి తరలిస్తున్న యువకుడిపై కేసు

image

గొల్లపల్లి మండలం చందోలి గ్రామ శివారులో తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి తరలిస్తున్న బచ్చల రామ్ చరణ్ పట్టుబడగా కేసు నమోదు చేసినట్లు గొల్లపల్లి ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి తెలిపారు. దీంతో రామ్ చరణ్‌ను అదుపులోకి తీసుకొని, అతని నుంచి 89 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని, గంజాయి వాడినా, విక్రయించిన చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు.

Similar News

News February 4, 2026

PDPL: ‘వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కట్టుదిట్టమైన చర్యలు’

image

సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. బుధవారం ఆయన కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ వేణుతో కలిసి ‘సోషల్ జస్టిస్ డే’ వేడుకలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 4, 2024న తెలంగాణ కేబినెట్ ఎస్సీ కుల వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని, ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న సోషల్ జస్టిస్ డే నిర్వహించుకుంటున్నామని తెలిపారు.

News February 4, 2026

సీఎం రేవంత్ బినామీ కంపెనీకి రూ.6వేల కోట్ల పనులు: KTR

image

TG: సీఎం రేవంత్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సంచలన ఆరోపణలు చేశారు. ‘KLSR అనేది సీఎం రేవంత్ బినామీ కంపెనీ. రేవంత్ వాడుతున్న కారు కూడా ఈ సంస్థ పేరు మీదే ఉంది. 2018లోనే ఈ కంపెనీపై IT దాడులు జరిగాయి. 2023లో దివాళా తీసింది. వాళ్ల దగ్గర సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకూ డబ్బులు లేవు. అలాంటి కంపెనీకి రూ.6వేల కోట్ల కాంట్రాక్టులు ఎలా ఇచ్చారు? ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు నోటీసులూ ఇచ్చింది’ అని పేర్కొన్నారు.

News February 4, 2026

HYD: రూ.20,930 శాలరీలో రూ.11,930 కమీషన్

image

​”నోరు తెరిస్తే పనిలోంచి తీసేస్తాం.. ఇచ్చింది పుచ్చుకొని పడి ఉండండి” అంటూ GHMC ఎంటమాలజీ కార్మికులను కాంట్రాక్ట్ ఏజెన్సీలు నిలువునా దోచుకుంటున్నాయి. నెలకు రావాల్సిన ₹20,930 జీతంలో, ఏకంగా ₹11,930 కమీషన్ కింద నొక్కేస్తూ కేవలం ₹9,000 మాత్రమే చేతిలో పెడుతున్నారని సమాచారం. 2021 నుంచి సాగుతున్న ఈ ‘దందా’పై కార్మికులు గళమెత్తినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గమనార్హం.