News February 1, 2025

గొల్లపల్లి: రోడ్డు ప్రమాదం.. ఏడేళ్ల చిన్నారి దుర్మరణం

image

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన పురాణం స్పందన (7) అనే చిన్నారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. స్పందన మండలంలోని చిల్వకోడూర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్నది. ప్యాసింజర్ ఆటో డోర్‌పై కూర్చొని ఇంటికి వస్తుండగా ఆటో ఎత్తేయడంతో పాప కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గొల్లపల్లి ఎస్ఐ సతీష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 10, 2025

సంగారెడ్డి: మంత్రుల వీడియో కాన్ఫరెన్స్

image

రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్‌లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు తీరును అడిగి తెలుసుకున్నారు. పత్తి కొనుగోలు ఎకరాకు 7 క్వింటాల నుంచి 12 క్వింటాలకు కొనుగోలు పెరిగేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని మంత్రులు తెలిపారు. కలెక్టర్లు ధాన్యం కొనుగోలను దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించారు.

News November 10, 2025

ఆదిలాబాద్: సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: ఎస్పీ

image

ఆదిలాబాద్ పట్టణంలోని పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల రోజును ఎస్పీ అఖిల్ మహాజన్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఎస్పీని నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. సమస్యలను విన్న ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చారు. బాధితుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రతి ఒక్క సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలన్నారు.

News November 10, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో విస్తృత తనిఖీలు

image

ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో పార్వతీపురం మన్యం ఎస్పీ ఎన్.మాధవరెడ్డి ఆదేశాలతో పలుచోట్ల విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ పార్కింగ్ వద్ద బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో చేస్తున్న తనిఖీలను ఎస్పీ పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా క్షుణ్ణంగా వాహనాలను తనిఖీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన ఆదేశాలతో తనిఖీలు ముమ్మరం చేశారు.