News January 26, 2025

గొల్లపల్లి: 150 ఫీట్ల పొడువు గల త్రివర్ణ పతాకంతో ర్యాలీ

image

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో ఆదివారం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 150 ఫీట్లు పొడువు గల త్రివర్ణ పతాకంతో 76 వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా ర్యాలీ తీశారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ తీసి వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. ప్రజల్లో దేశభక్తి పెంపొందించేందుకు ఈ ఉత్సవాలు నిర్వహించామన్నారు.

Similar News

News December 18, 2025

పార్వతీపురం: సీఎం సదస్సులో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

image

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం అమరావతి సచివాలయంలో జరిగిన 5వ కలెక్టర్ల సదస్సులో జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి, జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా నిర్వహించిన ఈ సదస్సులో జిల్లాకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.

News December 18, 2025

HYDలో Live-in ఫోబియా.. ట్రెండింగ్‌లో సిట్యుయేషన్ షిప్!

image

‘సిట్యుయేషన్ షిప్’.. ప్రేమ వద్దు, పెళ్లి అంతకన్నా వద్దు. కేవలం తోడు కోసం సాగే తాత్కాలిక బంధం ఇది. సిటీలోని అన్ని ప్రాంతాల్లో యువతలో ‘కమిట్‌మెంట్’ పట్ల భయం పెరిగిపోతుండటంతో ఈ ధోరణి బలపడుతోంది. ​భావోద్వేగాలను పంచుకుంటారు కానీ.. భవిష్యత్తులో ఉండరు. ఈ బంధాలు చివరకు తీవ్రమైన అభద్రతాభావాన్ని, మానసిక ఒత్తిడిని మిగిలిస్తున్నాయి. ఇలా సంప్రదాయ కుటుంబ వ్యవస్థ బీటలు వారుతోంది. దీనిపై మీ కామెంట్?