News September 14, 2024

గొల్లపూడి వరకు HYD-VJA జాతీయ రహదారి విస్తరణ

image

HYD- VJA జాతీయ రహదారిని గొల్లపూడి వరకు విస్తరించనున్నట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. తొలుత దండుమల్కాపూర్(TG) నుంచి జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వరకు విస్తరించాలని భావించినా, గొల్లపూడి వరకు 6 వరుసల రహదారి విస్తరించాలని కేంద్రం నిర్ణయించి ఈ పనులకు టెండర్లను ఆహ్వానించింది. 6 వరుసల రహదారి అందుబాటులోకి వస్తే ఎన్టీఆర్ జిల్లాలో ట్రాఫిక్ కష్టాలు తొలగిపోనున్నాయి.

Similar News

News September 18, 2024

విజయవాడ: మంత్రి నిమ్మలను కలిసిన పలువురు నేతలు

image

విజయవాడలో మంత్రి నిమ్మల రామానాయుడును మాజీ ఎంపీ, లైలా గ్రూప్ ఛైర్మన్, గోకరాజు గంగరాజు, ఎస్ఎల్‌వీ గ్రూప్ ఛైర్మన్ శ్రీనివాసరాజు, తదితరులు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడును వారు సత్కరించారు. అనంతరం బుడ‌మేరు వ‌ర‌ద కార‌ణంగా కేస‌ర‌ప‌ల్లిలో ముంపుకు గురైన ఎస్ఎల్‌వీ లైలా గ్రీస్ మెడోస్ కాలనీవాసులకు భ‌విష్య‌త్తులో త‌మ నివాసాల‌వైపు వ‌ర‌ద నీరు రాకుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు కోరారు.

News September 18, 2024

భవానీపురంలో నేడు పవర్ కట్

image

భవానీపురం సబ్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో మరమ్మతుల కారణంగా పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విజయవాడ టౌన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బీ.వీ సుధాకర్ తెలిపారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు టీచర్స్ కాలనీ, అప్నా బజార్ రోడ్డు, ఇందిరా ప్రియదర్శినీ కాలనీ, దర్గాప్లాట్లు, హెచ్బీ కాలనీలోని 450 ఎస్ఎఫ్ఎ బ్లాక్ వరకు విద్యుత్ సరఫరా ఉండదని చెప్పారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

News September 18, 2024

రేపు విజయవాడలో షర్మిల నిరాహార దీక్ష

image

విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి రేపు ఉదయం 10 గంటలకు నిరాహార దీక్షలో పాల్గొననున్నారు. రాహుల్ గాంధీపై బీజేపీ, శివసేన పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలకు ఆమె నిరసనగా దీక్ష చేపట్టనున్నారు. బీజేపీ, శివసేన నేతలు క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్ చేయనున్నారు.