News February 7, 2025
గొల్లప్రోలు: పవన్ చొరవ.. ఆ గ్రామస్థుల కల నెరవేరింది

గొల్లప్రోలు మండలం చిన్న జగ్గంపేట గ్రామస్థుల కల నెరవేరింది. గొల్లప్రోలు, తాటిపర్తి గ్రామాల నుంచి చిన్న జగ్గంపేట గ్రామానికి వెళ్లే రోడ్డు గోతులమయంగా మారడంతో రాత్రి సమయంలో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలు గురయ్యేవారు. ఆ గ్రామస్థులు అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం లేదు. దీంతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లగా రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీంతో ఆ గ్రామస్థుల ఇబ్బందులు తొలిగాయి.
Similar News
News February 27, 2026
బాల్య వివాహాలను అరికడదాం: ఎంపీ రఘునందన్

సమాజంలో బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా ఏర్పాటు చేసిన అవగాహన రథాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, పిల్లల భవిష్యత్తును నాశనం చేయవద్దని కోరారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
News February 27, 2026
అనకాపల్లి: 310 విద్యార్థుల గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో శుక్రవారం జరిగిన 27 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 310 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు డీఐఈఓ వినోద్ బాబు తెలిపారు. మొత్తం 3,321 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 3,011 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
News February 27, 2026
బ్లడ్ బాత్.. ₹5లక్షల కోట్లు ఆవిరి!

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 961 పాయింట్లు కోల్పోయి 81,287కు, నిఫ్టీ 317 పాయింట్ల నష్టంతో 25,178 వద్ద స్థిరపడింది. దాదాపు ₹5లక్షల కోట్ల సంపద ఆవిరైంది. సెన్సెక్స్ టాప్ 30 ఇండెక్స్‌లో ట్రెంట్, HCL, ఇన్ఫోసిస్, ఎటర్నల్ మినహా మిగతా షేర్లు అన్నీ నష్టాలతోనే ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ అస్థిరత, FII సెల్లింగ్, US-ఇరాన్ చర్చలు కొలిక్కి రాకపోవడం, రూపీ పతనం ఎఫెక్ట్ చూపించింది.


