News August 16, 2025

గొల్లప్రోలు: బాదం ఆకుపై శ్రీకృష్ణుని చిత్రం

image

గొల్లప్రోలు మండలం చెందుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు పిల్లి గోవిందరాజులు తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ఆయన బాదం ఆకుపై శ్రీకృష్ణుని చిత్రాన్ని లీఫ్ కార్వింగ్ ద్వారా చెక్కారు. ఈ కళ ద్వారా విద్యార్థులకు కృష్ణాష్టమి విశిష్టతను వివరించారు.

Similar News

News August 17, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News August 17, 2025

ఉగ్రవాది నూర్‌ మహమ్మద్‌‌కు రిమాండ్.. కడప జైలుకు తరలింపు

image

ధర్మవరానికి చెందిన నూర్‌ మహమ్మద్‌‌ను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. పాక్ ఉగ్రవాదులతో అతడు చాటింగ్‌ చేస్తున్నట్లు గుర్తించి ఇంటెలిజెన్స్‌ బ్యూరో, ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నూర్ మహమ్మద్‌పై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసి కదిరి కోర్టులో హాజరు పరిచారు. జడ్జి ఈనెల 29 వరకు రిమాండ్ విధించారు. కాగా, జైషే మహ్మద్‌ సంస్థకు చెందిన వాట్సాప్‌ గ్రూప్‌ల్లో నూర్‌ మెంబర్‌గా ఉన్నట్లు సమాచారం.

News August 17, 2025

సామాన్యులకే తొలి ప్రాధాన్యత: మంత్రి బీసీ

image

కూటమి ప్రభుత్వంలో సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం బనగానపల్లెలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సంబంధిత అధికారులతో నేరుగా ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.