News November 24, 2024
గోకవరం: బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి

బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి చెందిన విషాదకర ఘటన గోకవరం ప్రభుత్వాసుపత్రిలో జరిగింది. రాజవొమ్మంగి మండలం కొండపల్లికి చెందిన వెంకటలక్ష్మి గోకవరం ఫారెస్ట్ చెక్‌పోస్ట్‌లో పని చేస్తున్నారు. ప్రసవం నిమిత్తం ఆపరేషన్ చేస్తుండగా ఉమ్మనీరు రక్తనాళాల్లోకి వెళ్లి గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నవమాసాలు మోసి ఆ తల్లి బిడ్డను చూడకుండానే మృతి చెందడం కలిచివేసింది.
Similar News
News August 19, 2025
‘మత్తు’కు దూరంగా ఉండండి: ఈగల్ ఐజీ

రాజమండ్రి సెంట్రల్ జైలులో గంజాయి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో ఈగల్ ఐజి ఏకే రవికృష్ణ మంగళవారం మాట్లాడారు. ఎన్‌డీపీఎస్ చట్టం తీవ్రతను వారికి ఆయన వివరించారు. భవిష్యత్తులో మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, మంచి పౌరులుగా జీవించాలని సూచించారు. అనంతరం గంజాయి వాడబోమని ఖైదీలతో ప్రతిజ్ఞ చేయించారు.
News August 19, 2025
రాజమండ్రి: నకిలీ దస్తావేజులు సృష్టించే ముఠా అరెస్ట్

నకిలీ దస్తావేజులు సృష్టించి ఆస్తులు విక్రయిస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్య తెలిపారు. రాజమండ్రికి చెందిన గొల్లపల్లి కాశీ విశాలాక్షి ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీసులు చేపట్టిన విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కవలగొయ్యిలోని విశాలాక్షి ఆస్తులకు నకిలీ పత్రాలు సృష్టించి అమ్మివేసిన ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.
News August 19, 2025
ధవళేశ్వరంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను పరిశీలించిన కలెక్టర్

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మంగళవారం పరిశీలించారు. ఈ కేంద్రాన్ని ఆగస్టు 20న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా ప్రారంభిస్తారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేశ్ ప్రత్యక్షంగా పాల్గొని శిలాఫలకం ఆవిష్కరించి కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.