News November 13, 2024
గోకవరం: 1250 కేజీల నకిలీ టీపొడి స్వాధీనం..
గోకవరం మండలం రంపఎర్రంపాలెంలోని రైస్ మిల్లులో నకిలీ టీపొడి తయారు చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో 31 బస్తాల్లో నిల్వ ఉన్న 1250 కేజీల నకిలీ టీపొడిని ల్యాబ్‌కు పంపించామన్నారు. వాటితోపాటు 15క్రీం మెటీరియల్ బ్యాగులను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. టీపొడి నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు.
Similar News
News November 14, 2024
ముమ్మిడివరం: నటుడు పోసానిపై ఫిర్యాదు
సినీ నటుడు పోసాని కృష్ణ మురళీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో గురువారం జర్నలిస్ట్ రమేశ్ ఫిర్యాదు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బి.ఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతోపాటు ఛైర్మన్‌ను కించపరుస్తూ మాట్లాడారని చెప్పారు. నటుడు కృష్ణ మురళిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఇటీవల రాజమండ్రిలో కూడా పోసానిపై ఫిర్యాదు చేశారు.
News November 14, 2024
పంచారామక్షేత్రంలో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె పూజలు
సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయాన్ని మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మితా దర్శించుకున్నారు. గురువారం ఉదయం ఆమె ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు ఆలయ అర్చకులు స్వామివారి ఆశీర్వచనాలు అందించారు. ఆమె మాట్లాడుతూ.. కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
News November 14, 2024
ఉమ్మడి తూ.గో జిల్లాలో నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా
తూర్పుగోదావరి జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. గురువారం లీటరు పెట్రోల్ ధర రూ.109.40 ఉండగా డీజిల్ ధర రూ.96.79 ఉంది. అలాగే కాకినాడ జిల్లాలో పెట్రోల్ రూ.108.91 ఉండగా డీజిల్ రూ.96.78 గా ఉంది. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో లీటరు డీజిల్ ధర రూ. 97.55 ఉండగా, పెట్రోల్ రూ.109.73 గా ఉంది.