News January 13, 2026

గోదారమ్మ ఒడ్డున సంక్రాంతి ముచ్చట్లు.. మురిపిస్తున్న పల్లెటూరి అందాలు!

image

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి శోభ ఉట్టిపడుతోంది. పచ్చని ప్రకృతి ఒడిలో హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, రంగురంగుల ముగ్గులతో పల్లెలు కళకళలాడుతున్నాయి. ప్రభల తీర్థాలు, కోడి పందాలు, సంప్రదాయ పిండివంటలతో గోదారోళ్ల ఆతిథ్యం పర్యాటకులను కట్టిపడేస్తోంది. ఆత్మీయ పలకరింపులు, బంధుమిత్రుల సందడితో ఉభయ గోదావరి జిల్లాలు ఇప్పుడు దక్షిణ భారతానికే పండగ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి.

Similar News

News February 15, 2026

పశువులకు ‘జోన్స్’ వ్యాధి ఎలా సోకుతుంది?

image

పాడి పశువులు సాధారణంగా మురికినీరు, శుభ్రంగా లేని మేత తీసుకోవడం వల్ల జోన్స్ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి అన్ని రకాల పశువులకు సోకుతుంది. సాధారణంగా గేదెల్లో రెండు ఈతల తర్వాత ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. తల్లికి ఈ వ్యాధి ఉంటే పుట్టే దూడకు సోకుతుంది. దీంతోపాటు సహజ, కృత్రిమ సంపర్కం ద్వారా కూడా ఒక పశువు నుంచి మరో పశువుకు సోకుతుంది. సహజంగా పశువుల్లో రోగ నిరోధక శక్తి తగ్గినపుడు ఈ వ్యాధి వస్తుంది.

News February 15, 2026

బంగ్లాదేశ్ తర్వాతి ప్రెసిడెంట్‌గా యూనస్?

image

బంగ్లాదేశ్ ఎన్నికల్లో BNP ఘనవిజయం సాధించడంతో ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనస్ పాత్ర తర్వాత ఏంటనే చర్చ జరుగుతోంది. ఆయన్ను దేశాధ్యక్షుడిగా నియమించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం మంగళవారం కొలువుదీరనుంది. సమర్థులైన మేధావుల సేవలను వినియోగించుకుంటామని BNP వర్గాలు చెబుతున్నప్పటికీ యూనస్ మాత్రం తనకు రాజకీయ పదవులపై ఆసక్తి లేదని గతంలో చెప్పారు.

News February 15, 2026

ఢిల్లీలో ఫిర్యాదు.. వరంగల్‌లో దర్యాప్తు..!

image

నర్సంపేట(M) లక్నేపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో పలువురిని మోసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఢిల్లీకి చెందిన ఓ వృద్ధ మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ మోసపు బాగోతం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో నిందితురాలి చిన్న కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మరిన్ని కీలక అంశాలు బయటికి వస్తున్నట్లు సమాచారం.