News October 21, 2025
గోదావరిఖనిలోనూ నిజామాబాద్ తరహా ఎన్‌కౌంటర్..!

NZBలో రియాజ్ పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. అచ్చం ఇలాంటి ఘటనే 2012లో గోదావరిఖనిలో జరిగింది. 2012 JUN 11న పోలీసులపై తిరగబడ్డ రౌడీషీటర్ కట్టెకొల సుధీర్‌ను కాల్చిచంపారు. ఓ కేసు విషయంలో RGM మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు సుధీర్‌ను అరెస్ట్ చేయడానికి యత్నిస్తుండగా అతడు పోలీసులపై తన రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో ఆత్మరక్షణకు పోలీసులు జరిపిన కాల్పుల్లో సుధీర్ చనిపోయాడు.
Similar News
News October 21, 2025
అధిక ఆదాయం పుదీనా సాగుతో సొంతం

తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడి, ఆదాయమిచ్చే పంట ‘పుదీనా’. చల్లని వాతావరణం పుదీనాకు అనుకూలం. సారవంతమైన, ఎక్కువ సేంద్రియ పదార్థం గల తేలికపాటి నేలలు, మురుగునీరు పోయే తేలికపాటి ఒండ్రు నేలలు పుదీనా సాగుకు అనుకూలం. పుదీనా కాండం మొక్కలుగా నాటుకోవాలి. ఎకరానికి 350-500KGల కాండం మొక్కలు అవసరం. మొక్క వరుసల మధ్య 20-40 సెంటిమీటర్ల దూరం ఉండాలి. తొలికోత మొక్క మొదళ్లను 5-6 సెంటీ మీటర్ల వరకు వదిలిపెట్టి కోయాలి.
News October 21, 2025
నల్లుల బెడద.. గూగుల్ ఆఫీసు తాత్కాలికంగా మూత!

టెక్ దిగ్గజం గూగుల్‌కు అనుకోని సమస్య వచ్చింది. నల్లుల బెడదతో న్యూయార్క్‌లోని చెల్సియా క్యాంపస్ తాత్కాలికంగా మూతబడింది. దీంతో ఉద్యోగులు WFH చేయాలని మెయిల్ పెట్టింది. నల్లుల సమస్య పరిష్కారమయ్యే వరకు ఆఫీసుకు రావద్దని చెప్పినట్లు సమాచారం. ఈ నెల 19న నల్లుల నివారణ చర్యలు చేపట్టి, సోమవారం నుంచి ఆఫీసుకు వచ్చేందుకు అనుమతిచ్చింది. 2010లోనూ గూగుల్ 9th అవెన్యూ ఆఫీసులు ఇలాంటి పరిస్థితే ఎదుర్కోవడం గమనార్హం.
News October 21, 2025
విజయవాడలో ఆ స్థలం వినియోగిస్తే లక్షల మందికి మేలు!

గుణదలలోని ESI ఆసుపత్రి స్థలం ఆక్రమణలకు గురవుతోంది. మొత్తం 25 ఎకరాల్లో 2 ఎకరాలు ఇప్పటివరకు ఆక్రమణలకు గురైంది. మిగతా 23 ఎకరాల స్థలం ముళ్ళ కంపలు పెరిగిపోయి అడవిని తలపిస్తోంది. ESI విజయవాడ డివిజన్ పరిధి 7 జిల్లాలో 5 లక్షలకు పైగా కార్మికులు బీమా చెల్లిస్తున్నారు. వీరందరికీ వైద్యం అందించేందుకు కనీసం ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులో లేదు. ఈ 23 ఎకరాల స్థలాన్ని అందుకు వినియోగిస్తే బావుంటుంది.