News January 7, 2026
గోదావరిఖనిలో 75 రోజుల్లో క్యాత్ లాబ్..!

గోదావరిఖనిలో 75 రోజుల్లో క్యాత్ లాబ్ (మెడికల్ బెనిఫిట్స్) ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయినట్లు సమాచారం. సింగరేణి ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్స్, పారామెడికల్ పోస్టులు నెల చివరికి భర్తీ చేయనున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు రూ.8 లక్షల వరకు మందులు, సింగరేణి ఉద్యోగులకు రూ.కోటి బీమా సౌకర్యం కల్పిస్తామని డిప్యూటీ సీఎం భట్టి అసెంబ్లీలో తెలిపారు.
Similar News
News February 13, 2026
సంచలనం.. ఓటుకు రూ.70,000?

TG: రంగారెడ్డి(D) మొయినాబాద్ మున్సిపాలిటీలోని ఓ వార్డు ఎన్నిక సంచలనంగా మారింది. కౌన్సిలర్ పదవి కోసం పోటీ చేసిన ఓ అభ్యర్థి ఓటుకు ₹70K, 25KGల బియ్యం, 15 లీటర్ల వంట నూనె, పట్టుచీర పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ₹7Cr ఖర్చు చేశారని టాక్. అదే వార్డులో మరో అభ్యర్థి కూడా ఓటుకు ₹40K పంచినట్లు స్థానికులు చెబుతున్నారు. మున్సిపాలిటీలో రియల్ ఎస్టేట్ ఊపులో ఉండటంతోనే పదవికి పోటీ ఏర్పడిందంటున్నారు.
News February 13, 2026
నెల్లూరుకు మంచి రోజులు వస్తున్నాయి..!

నెల్లూరు జిల్లాకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. రూ.1000 కోట్లతో ప్రీమియం ఎక్స్‌ప్లోజివ్స్ సంస్థ పరిశ్రమ పెట్టనుంది. రాకెట్‌లో వినియోగించే పేలుడు పదార్థాలను ఈ సంస్థ తయారు చేయనుంది. దుత్తలూరు మండలం రాచవారిపల్లి, బ్రహ్మేశ్వరం పరిధిలో వీరికి 500 ఎకరాలు కేటాయించనున్నారు. స్టెయిన్‌లెస్ స్టీల్ ఉత్పత్తి చేసే రెనైసెన్స్ అనే మరో సంస్థ సైతం రూ.4వేల కోట్లు పెట్టడానికి ఆసక్తి చూపుతోంది.
News February 13, 2026
సంగారెడ్డి: బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత అవగాహన సదస్సు

సంగారెడ్డిలోని బీసీ స్టడీ సర్కిల్‌లో ఈనెల 18న ఐఈఎల్టీఎస్ (IELTS) పై ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన ఆసక్తి గల అభ్యర్థులు తమ స్టడీ సర్టిఫికెట్లతో ఈనెల 17వ తేదీలోపు నేరుగా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


