News September 5, 2025
గోదావరిఖని: ‘ఆత్మ గౌరవం దెబ్బతింటున్నా నోరు విప్పని ప్రధాని మోదీ’

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బరితెగించి మాట్లాడుతున్నా, భారత దేశ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటున్నా ప్రధాని మోదీ నోరు విప్పడం లేదని CPM నేత ఎస్.వీరయ్య అన్నారు. గోదావరిఖని శ్రామిక్ భవన్‌లో భారత ప్రయోజనాలపై ట్రంప్ దాడి-భారత ప్రభుత్వ వైఖరిపై శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం,లౌకిక విలువలు, సామరస్య భావనలను కాపాడుకోవడానికి దేశ ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
Similar News
News September 6, 2025
కరీంనగర్: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న డా.కాంపల్లి అర్జున్

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా HYDలోని శిల్పకళా వేదికలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా వేడుకలను నిర్వహించింది. ఈ మేరకు KNRలోని SRR ప్రభుత్వ కళాశాలలో వాణిజ్య విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డా.కాంపల్లి అర్జున్ తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుని అందుకున్నారు. అర్జున్ మాట్లాడుతూ.. ఈ అవార్డు ఉపాధ్యాయుడి కృషికి రాష్ట్రం ఇచ్చిన గౌరవమన్నారు.
News September 6, 2025
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

☛ ఆమదాలవలసలో వివాహిత సూసైడ్
☛రణస్థలం: అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి
☛టెక్కలి: నిర్లక్ష్యం.. నేడు శాపం అవుతోందా?
☛పలాస: ఆటో ఢీకొని యువకుడు మృతి
☛ఉపాధ్యాయ వృత్తి చాలా ప్రాముఖ్యమైనది: కలెక్టర్
☛మందస: ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి గాయాలు
☛నరసన్నపేట: బంగారం వ్యాపారి మృతదేహం లభ్యం
☛గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత: ఎమ్మెల్యే కూన రవి కుమార్
News September 6, 2025
ఇబ్రహీంపట్నం: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులిగా శోభారాణి

ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు ఎంపీహెచ్ఎస్ ఇంగ్లిష్ టీచర్ సీహెచ్.శోభారాణి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులిగా ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారి రాము శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 7న కలెక్టరేట్‌లో జరిగే కార్యక్రమంలో ఆమె జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డును స్వీకరించనున్నారు. ఆమెను పలువురు అభినందించారు.