News September 13, 2025
గోదావరిఖని: ‘ఈనెల 15న కామారెడ్డిలో BC విజయోత్సవ సభ’

దేశంలో ఎక్కడా లేనివిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం BC-కుల గణన చేపట్టిందని జిల్లా OBC-సెల్ అధ్యక్షుడు పెండ్యాల మహేశ్ అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 15న కామారెడ్డిలో జరిగే BC విజయోత్సవ సభను అన్ని వర్గాల వారు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర అన్ని వర్గాల ఐక్యతను చాటి చెప్పిందన్నారు.
Similar News
News April 14, 2026
TU: రేపటి నుంచి ఇంటిగ్రేటెడ్ పీజీ(8,10 సెమిస్టర్) పరీక్షలు

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ (అప్లైడ్ ఎకనామిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ) 8, 10 సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు ఈ నెల 15 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. యూనివర్సిటీ కలశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 10-12గం.ల వరకు జరుగుతాయన్నారు. వివరాలకు వర్సిటీ వెబ్ సైట్ సందర్శించాలని ఆయన తెలిపారు.
News April 14, 2026
గుంటూరు: దరఖాస్తు గడువు పొడిగింపు

గుంటూరు జిల్లాలో 38 బ్యాక్‌లాగ్ పోస్టుల దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగించారు. ఈ మేరకు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వెంకటరమణప్ప సోమవారం తెలిపారు. ఇందులో టైపిస్ట్ పోస్టులకు డిగ్రీతో పాటు సీపీటీ (CPT) పాసై ఉండాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫారాల కోసం https://guntu-rap.in/dw2026 వెబ్‌సైట్‌ను చూడవచ్చన్నారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News April 14, 2026
అభి‘షేక్’ చేస్తాడనుకుంటే.. సున్నాల్లో రికార్డ్

హిట్టర్ అభిషేక్ శర్మకు ఈ ఏడాది కలిసి రావట్లేదు. షేక్ చేస్తాడనుకుంటే ఇటీవల T20WC, ప్రస్తుతం ఐపీఎల్‌లో వరుసగా విఫలమవుతూ అప్పుడప్పుడూ మెరుస్తున్నారు. ఈ క్రమంలో T20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక <<19642127>>డకౌట్స్<<>>(18 ఇన్నింగ్సుల్లో ఏడుసార్లు) అయిన ఇండియన్ ప్లేయర్‌గా చెత్త రికార్డు నమోదు చేశారు. రోహిత్ 2018లో, సంజూ శాంసన్ 2024లో 32 ఇన్నింగ్సుల్లో ఆరుసార్లు సున్నాకు ఔటయ్యారు.


