News October 4, 2025

గోదావరిఖని: ఎస్‌ఓటూ జీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్‌

image

సింగరేణి ఆర్జీ 1 ఎస్‌ఓటూ జీఎంగా చంద్రశేఖర్‌ బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ ఎస్‌ఓటూ జీఎంగా విధులు నిర్వహించిన గోపాల్‌ సింగ్‌ జీఎంగా పదోన్నతి పొంది బదిలీ అయ్యి ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఈ పోస్ట్‌ ఇన్ని రోజులుగా ఖాళీగా ఉంది. దీంతో చంద్రశేఖర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ కాగా బాధ్యలు స్వీకరించారు. ఆయనను పర్సనల్‌ డిపార్ట్‌మెంట్‌తోపాటు ఇతర డిపార్ట్‌మెంట్ల అధికారులు సన్మానించారు.

Similar News

News April 15, 2026

నాతవరం జీడి తోటలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

నాతవరం మండలం గన్నవరం గ్రామ పరిసర జీడి తోటలో గుర్తుతెలియని వ్యక్తి (40) మృతిచెందాడు. సమాచారం అందుకున్న SI వై.తారకేశ్వరరావు మంగళవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు 4-5 రోజుల క్రితమే మరణించినట్లు అంచనా వేస్తున్నారు. మృతుడు నలుపు షార్ట్, చెక్స్ షర్ట్, క్రాక్స్ చెప్పులు ధరించి ఉన్నాడు. వివరాలు తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని SI కోరారు.

News April 15, 2026

హార్ముజ్ బ్లాక్.. ఇరాన్‌కు ఎంత నష్టమంటే?

image

పశ్చిమాసియాకు అతి కీలకమైన హార్ముజ్ జలసంధిని <<19639152>>యుద్ధ నౌకలతో<<>> అమెరికా బ్లాక్ చేయడం తెలిసిందే. ఇరాన్ పోర్టులకు వచ్చే, వెళ్లే నౌకలపై ఆంక్షలు పెట్టింది. దీంతో ఇరాన్‌కు రోజూ 435 మిలియన్ డాలర్ల(రూ.4 వేల కోట్లు) నష్టం వాటిల్లే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. దిగ్బంధనం లేని ప్రాంతంలో ఇరాన్‌కు చెందిన 154 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉందని Kpler తెలిపింది. ఆ క్రూడ్‌ను ఎగుమతి చేసేందుకు ఛాన్స్ ఉంది.

News April 15, 2026

తిరుచానూరులో మిథాలి రాజ్ పూజలు

image

మాజీ మహిళా క్రికెటర్ మిథాలి రాజ్ మంగళవారం కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద సూపరింటెండెంట్ రమేశ్, ఏవిఎస్వో రాధాకృష్ణ ఆమెకు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న మిథాలి రాజ్‌కు అర్చకులు ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయాధికారులు ఆమెకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.