News September 17, 2025

గోదావరిఖని: గోవాకు ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజీ

image

గోదావరిఖని ఆర్టీసీ డిపో నుంచి గోవాకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. ఈ నెల 23న ఉదయం 10 గంటలకు గోదావరిఖని బస్టాండ్ నుంచి స్లీపర్ బస్ బయలుదేరుతుంది. ఈ ప్యాకేజీలో మురుడేశ్వర్, గోకర్ణ, గోవా పర్యటనలు ఉంటాయి. ఒక్కరికి ₹7,500 చొప్పున ఛార్జ్ నిర్ణయించారు. నగరానికి 28న తిరిగి చేరుకుంటారని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. రిజర్వేషన్ల కోసం 7013504982, 7382847596 నంబర్లలో సంప్రదించవచ్చు.

Similar News

News September 17, 2025

హుస్నాబాద్: ఆరోగ్య శ్రీ సేవలు పునరుద్ధరించాలి: మంత్రి పొన్నం

image

సిద్దిపేట జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడం వల్ల పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మానవీయ కోణంలో ఆలోచించి సేవలు పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1,375 వైద్య చికిత్సల ఛార్జీలను సగటున 22 శాతానికి పైగా పెంచిందని గుర్తు చేశారు.

News September 17, 2025

1-12 తరగతుల వరకు మార్పులు: CM

image

TG: విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావడమే తన ధ్యేయమని CM రేవంత్ అన్నారు. నూతన విద్యా విధానం రూపకల్పనపై అధికారులతో సమీక్షించారు. ‘పేదరిక నిర్మూలనకు విద్య ఒక్కటే మార్గం. 1-12 తరగతుల వరకు మార్పులు జరగాలి. ఎలాంటి నిర్ణయానికైనా నేను సిద్ధం. ఇంజినీరింగ్ విద్యార్థులు ఉద్యోగాలు పొందలేకపోవడానికి నాణ్యత, నైపుణ్యత కొరవడటమే కారణం. మేధావులు, విద్యాధికుల సూచనలతో కొత్త పాలసీ రూపొందించాలి’ అని ఆదేశించారు.

News September 17, 2025

ఫైనల్ చేరిన నీరజ్ చోప్రా

image

టోక్యోలో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఫైనల్ చేరారు. ఆటోమేటిక్ ఫైనల్ మార్క్ 84.50 మీ. కాగా ఆయన తొలి అటెంప్ట్‌లోనే జావెలిన్‌ను 84.85 మీ. విసిరారు. వెబెర్(జర్మనీ) 87.21 మీ., వెంగెర్(పోలెండ్) 85.67 మీ. విసిరి ఫైనల్లో అడుగుపెట్టారు. ఫైనల్ రేపు జరగనుంది. ఇక 2023లో బుడాపేస్ట్‌లో జరిగిన ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ గోల్డ్ కొల్లగొట్టారు.