News October 9, 2025

గోదావరిఖని- తిరుపతికి ప్రత్యేక సూపర్ లగ్జరీ

image

ఈనెల 12న GDK నుంచి అరుణాచలం, తిరుపతికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్ ఏర్పాటు చేసినట్లు RTC DM నాగభూషణం తెలిపారు. పెద్దలకు రూ.5,500, పిల్లలకు రూ.4,200 ఛార్జ్ నిర్ణయించామన్నారు. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, తిరుపతి దర్శనాలు చేసుకొని GDK వస్తామన్నారు. ఈనెల 12న మధ్యాహ్నం 2 గంటలకు బస్సు బయలుదేరి 16న రాత్రి GDK చేరుకుంటుందన్నారు. మరిన్ని వివరాలకు 7013504982, 7382847596 నంబర్లను సంప్రదించాలన్నారు

Similar News

News October 9, 2025

వచ్చే డీఎస్సీలో 1,803 పీఈటీ, 261 HM పోస్టుల భర్తీ!

image

TG: ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు పీఈటీ ఉండాలన్న CM రేవంత్ ఆదేశాలతో అధికారులు చర్యలకు దిగారు. మొత్తం 4,641 హైస్కూళ్లలో 2,800కు పైగా పాఠశాలల్లో పీఈటీలు ఉన్నారు. దీంతో కొత్తగా 1,803 పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అటు కొత్త స్కూళ్లలో 261 హెడ్‌మాస్టర్ పోస్టులు భర్తీకి ప్రపోజల్ చేశారు. వీటిని వచ్చే DSCలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

News October 9, 2025

కృష్ణా: నేటితో ముగియనున్న గడువు

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో ఆగస్టు 2025లో నిర్వహించిన బి.ఫార్మసీ 4వ, ఎం.ఫార్మసీ 2వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు అక్టోబర్ 9వ తేదీలోగా ఎం.ఫార్మసీకి ఒక్కో పేపరుకు రూ.1,100, బి.ఫార్మసీకి రూ.1,000 ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ పరీక్షల విభాగం సూచించింది.

News October 9, 2025

భద్రాద్రి: నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

image

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 11వ తేదీ వరకు రోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. 12న పరిశీలన, 13న అభ్యంతరాల స్వీకరణ, 15న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని పేర్కొన్నారు.