News April 17, 2025
గోదావరిఖని పట్టణంలో యువతి ఆత్మహత్య

గోదావరిఖని పవర్ హౌస్‌కాలనీకి చెందిన చుంచు ప్రత్యూష(26) ఆత్మహత్య చేసుకుంది. PG పూర్తిచేసిన ప్రత్యూష కొద్ది రోజులుగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. అయితే, ఇటీవల వెలువడ్డ గ్రూప్స్ ఫలితాల్లో ఉద్యోగం సాధించలేకపోవడంతో మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో బుధవారం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువతి తండ్రి విఠల్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భూమేష్ తెలిపారు.
Similar News
News December 16, 2025
కనకాంబరంలో ఆకుమచ్చ తెగులు

కనకాంబరం పంటను ఆశించే చీడపీడల్లో ఆకుమచ్చ తెగులు ఒకటి. ఆకుమచ్చ తెగులు సోకిన కనకాంబరం మొక్క ఆకు పైభాగంలో చిన్న, గుండ్రని పసుపు పచ్చ మచ్చలు ఏర్పడి.. తర్వాత గోధుమ రంగులోకి మారతాయి. తెగులు సోకిన ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. దీని వల్ల మొక్క ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. ఈ తెగులు నివారణకు 2.5గ్రా మాంకోజెబ్‌ను లీటర్ నీటికి కలిపి ఆకులన్నీ తడిచేలా పిచికారీ చేయాలి.
News December 16, 2025
శ్రీకాకుళం జిల్లాలో 1,55,876 మంది పిల్లలకు పోలియో చుక్కలు

ఈనెల 21 నుంచి జిల్లాలో జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. (0-5) ఏళ్లలోపు 1,55,876 మంది పిల్లలు ఉన్నారని, ఆయా కేంద్రాల్లో పోలియో చుక్కలు వేయనున్నట్లు DMHO డాక్టర్ కే అనిత మంగళవారం తెలిపారు. అందుబాటులో లేని వారికి 22 – 25 తేదీల్లో ఇంటింటికి వెళ్లి వేస్తారన్నారు. జిల్లాలో మొత్తం 1252 పోలియో కేంద్రాలు ఉన్నాయన్నారు.
News December 16, 2025
తూ.గో: సార్వత్రికం.. చదువుల తోరణం

అనివార్య కారణాలతో చదువుకు దూరమైన వారికి సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) వరంలా మారింది. ఉమ్మడి జిల్లాలో దీనికి ఆదరణ గణనీయంగా పెరిగింది. మార్చి-2026 పరీక్షలకు పదో తరగతిలో 5,226, ఇంటర్లో 13,773 మంది హాజరవుతున్నారు. అత్యధికంగా కాకినాడ జిల్లా నుంచి 7,844 మంది, తూర్పుగోదావరి నుంచి 6,066, కోనసీమ నుంచి 5,089 మంది విద్యార్థులు ఉన్నత విద్యార్హతలు సాధించేందుకు సిద్ధమయ్యారు.


