News September 13, 2025
గోదావరిఖని: ప్రజా భవన్‌ను ముట్టడించిన కార్మిక సంఘాల జేఏసీ

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై జేఏసీ నాయకులు, కార్మికులు హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌ను శుక్రవారం ముట్టడించారు. వారికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, గుమ్మడి నర్సయ్య నిలిచారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి సమస్యలపై విన్నవించారు. వేతనాలను పెంచాలని, లాభాల వాటా రూ.20 వేలు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News April 14, 2026
నంద్యాల: ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్రకు ఏడుగురు విద్యార్థులు

ప్రత్యేక ప్రతిభావంతుల బృందం నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్రను మంగళవారం ఉండవల్లిలో మంత్రి లోకేశ్ ప్రారంభించారు. రాష్ట్రం వ్యాప్తంగా 21 మంది విద్యార్థుల బృందంలో నంద్యాల జిల్లాకు చెందిన విద్యార్థులు ఏడుగురు ఉండడం విశేషం. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఎవరెస్ట్ శిఖర అధిరోహణ యాత్ర చేపట్టడం దేశంలో ఇదే తొలిసారి అని మంత్రి తెలిపారు. విద్యార్థులను అన్ని విధాల ప్రోత్సహిస్తామన్నారు.
News April 14, 2026
ఐపీఎల్: SRHలోకి కొత్త ప్లేయర్

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి మరో ఫాస్ట్ బౌలర్ వచ్చారు. గాయంతో టోర్నీకి దూరమైన బ్రైడన్ కార్స్(ENG) స్థానంలో శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంకను తీసుకున్నట్లు ఫ్రాంచైజీ అఫీషియల్‌గా ప్రకటించింది. రూ.75లక్షల ప్రైస్‌తో ఆయన్ను తీసుకుంది. మధుశంక గతంలో ముంబై ఇండియన్స్‌కు ఆడారు. SL తరఫున ఒక టెస్ట్, 28 వన్డేలు, 19 టీ20ల్లో మొత్తం 70 వికెట్లు పడగొట్టారు.
News April 14, 2026
కామారెడ్డి: ట్రాఫిక్ నిబంధనలతోనే భద్రత: ఎస్పీ

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు KMR ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. వాహనం నడిపేటప్పుడు సెల్ ఫోన్ వాడకం ప్రాణాంతకమని ఆయన హెచ్చరించారు. ప్రజల భద్రత దృష్ట్యా ఏప్రిల్ 18 వరకు ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పిస్తామని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా నియమాలను పాటించి ప్రమాదాలను అరికట్టాలని ఆయన పిలుపునిచ్చారు.


