News November 17, 2025

గోదావరిఖని: బైక్ టైర్లో చీర ఇరుక్కుని మహిళ మృతి

image

GDKలోని గోదావరి నది బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. మంచిర్యాల(D) వేమనపల్లికి చెందిన పుష్పలత GDK నుంచి తన గ్రామానికి తమ్ముడు అరుణ్‌తో కలిసి బైక్‌పై వెళ్తుంది. ఈ క్రమంలో బ్రిడ్జ్ వద్ద తన చీర కొంగు బండి వెనుక టైర్లో ఇరుక్కుపోవడంతో ఇద్దరూ కింద పడిపోయారు. ఈ ఘటనలో పుష్పలత అక్కడికక్కడే మరణించగా అరుణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.

Similar News

News November 17, 2025

మెదక్: సొసైటీ డైరెక్టర్ మృతి

image

చిన్న శంకరంపేట మండలం జంగారాయి సొసైటీ డైరెక్టర్ సిద్ది రెడ్డి అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సిద్ది రెడ్డి మృతితో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన సిద్ది రెడ్డి కుటుంబాన్ని సొసైటీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో పాటు డైరెక్టర్‌లు వివిధ పార్టీల రాజకీయ నాయకులు పరామర్శించారు.

News November 17, 2025

తిరుపతి: ఇప్పటి వరకు 231 మంది అరెస్ట్

image

ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు రెడ్ శాండిల్ టాస్క్‌ఫోర్స్ అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు పలు కేసులు కేసులు నమోదు చేశారు. 231 మందిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు. దాదాపు 1,778 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు వినియోగించిన 57వాహనాలను సీజ్ చేసినట్లు రెడ్ శాండిల్ టాస్క్‌ఫోర్స్ తిరుపతి ఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు.

News November 17, 2025

రష్యా నుంచి ఆయిల్ కొనే దేశాలపై 500% టారిఫ్!

image

రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసే దేశాల కట్టడికి అమెరికా సెనేట్ కొత్త బిల్లు తెచ్చింది. అలాంటి దేశాలపై 500% టారిఫ్ విధించేలా తెచ్చే బిల్లును సెనేటర్ లిండ్సే ప్రతిపాదించారు. దీనికి ప్రెసిడెంట్ ట్రంప్ మద్దతిచ్చారు. దీంతో భారత్, చైనా లాంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించినట్లు సమాచారం.