News February 19, 2025

గోదావరిఖని: ‘భవిష్యత్ ఆ అరుదైన ఖనిజాలదే..!’

image

భవిష్యత్ ఆ అరుదైన ఖనిజాలదే అని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు. భారతదేశాన్ని 2047 నాటికి అగ్ర స్థాయిలో తీర్చిదిద్దేందుకు రూపొందించుకున్న వికసిత్ లక్ష్యాలను చేరుకోవడంలో మైనింగ్ రంగం పాత్ర అత్యంత కీలకమని, ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో గణనీయమైన పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు.

Similar News

News December 25, 2025

BREAKING: NZB: చందూర్‌లో యాక్సిడెంట్.. మహిళ మృతి

image

నిజామాబాద్ జిల్లా చందూరు మండల శివారులో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. బాన్సువాడ నుంచి నిజామాబాద్ వెళుతున్న కారు వేగంగా వచ్చి రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టింది. ప్రమాదంలో మహిళ చనిపోయింది. సదరు మహిళ బిహార్ నుంచి నాట్లు వేసేందుకు తెలంగాణకు వచ్చినట్లు సమాచారం.

News December 25, 2025

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్

image

TG: రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ శీతాకాల సమావేశాలు ఈ నెల 29న 10.30amకు మొదలవుతాయని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎన్నిరోజులు సమావేశాలు జరగాలనేది BAC భేటీలో నిర్ణయించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి సహా పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ జరిగే ఆస్కారముంది. అలాగే MPTC, ZPTC ఎన్నికలు, BCలకు 42% రిజర్వేషన్ల సాధనకు కేంద్రంపై ఏ విధంగా ఒత్తిడి తేవాలనే దానిపై డిస్కస్ చేయనున్నట్లు తెలుస్తోంది.

News December 25, 2025

BREAKING మైదుకూరు: RTC బస్సు నుంచి దూకిన యువతి.!

image

ఆళ్లగడ్డ- మైదుకూరు RTC బస్సు నుంచి యువతి దూకి గాయపడిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ప్రయాణికుల వివరాల మేరకు.. మైదుకూరు శ్రీరామ్ నగర్‌కు చెందిన ఓ యువతి తన స్టాప్ రాగానే బస్సును ఆపాలని కోరగా డ్రైవర్ ఆపలేదు. దీంతో యువతి ఒక్కసారిగా బస్సు నుంచి దూకి గాయపడింది. కాగా బస్సు డ్రైవర్ బస్సును ఆపి పరారైనట్లు సమాచారం. ఘటన స్థలానికి RTC అధికారులు చేరుకొని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.