News October 8, 2025
గోదావరిఖని- మేడారంకు SPECIAL BUS

గోదావరిఖని RTC డిపో నుంచి ఈనెల 10న ఉదయం 5 గంటలకు మేడారానికి స్పెషల్ బస్ బయలుదేరుతుందని, ఈ ట్రిప్‌లో రామప్ప, లక్నవరం, మేడారం(సమ్మక్క, సారలమ్మ), బొగత వాటర్ ఫాల్స్(తెలంగాణ నయాగరా జలపాతాలు) సందర్శించవచ్చని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. టికెట్ ధర ఒక్కొక్కరికి రూ.1,000 అని, అదేరోజు రాత్రి తిరిగి గోదావరిఖనికి బస్సు చేరుకుంటుందని చెప్పారు. రిజర్వేషన్ల కొసం 7382847596 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News October 8, 2025
క్లచ్ చెస్ టోర్నీ: పోటీ పడనున్న దిగ్గజాలు

నేడు USAలో క్లచ్ చెస్ టోర్నీ ప్రారంభం కానుంది. చిరకాల ప్రత్యర్థులు, చెస్ దిగ్గజాలు విశ్వనాథన్ ఆనంద్, గ్యారీ గాస్పరోవ్(రష్యా) ఇందులో తర్వాత పోటీ పడనున్నారు. ఈ దిగ్గజాలు ఇప్పటివరకు పోటీ పడిన గేమ్స్‌లో కాస్పరోవ్‌దేపై చేయి. మరోవైపు వరల్డ్ నం.1 కార్ల్‌సన్, భారత ప్లేయర్ గుకేశ్ ఈ టోర్నీలో తలపడనున్నారు. అన్ని ఫార్మాట్లలో గుకేశ్‌పై కార్లసన్‌దే ఆధిపత్యం ఉంది.
News October 8, 2025
విశ్వభారతి సెంట్రల్ వర్సిటీలో 54 పోస్టులు

విశ్వభారతి సెంట్రల్ యూనివర్సిటీ 54 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 31వరకు అప్లై చేసుకోవచ్చు. వివిధ విభాగాల్లో ప్రొఫెసర్ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనుంది. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనుంది. దరఖాస్తు ఫీజు రూ.2వేలు, మహిళలు, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. వెబ్‌సైట్: https://www.visvabharati.ac.in/
News October 8, 2025
KNR: డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 2025- 26 విద్యాసంవత్సరానికి DMIT, DANS డిప్లొమా కోర్సులకు అర్హులైన MPC, Bi.PC అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28లోపు కళాశాలలో అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించాలని, మరిన్ని వివరాలకు కళాశాల పోర్టల్‌ను సందర్శించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. WEBSITE: http://www.gmknr.com. SHARE IT.