News November 19, 2025
గోదావరిఖని: 10 STATES.. 16 Days.. 4000 KMల సైక్లింగ్ రైడ్

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని FIT INDIAలో భాగంగా కశ్మీర్ TO కన్యాకుమారి వరకు A RIDE FOR UNITY పేరిట సైక్లింగ్ రైడ్ చేపట్టారు. 3000 మంది అప్లై చేసుకోగా 150 మందిని ఎంపిక చేశారు. సింగరేణి OCP 5 EP ఆపరేటర్ వెంకట తిరుపతి రెడ్డికి కూడా ఇందులో అవకాశం దొరికింది. 10 STATES.. 16 DAYS.. 4000 KMల సైక్లింగ్ రైడ్లో పాల్గొన్నారు. ఇది తనకు అద్భుత అనుభూతిని ఇచ్చిందని తిరుపతి రెడ్డి తెలిపారు.
Similar News
News November 19, 2025
రూ.1.25కోట్ల ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి.. కానీ!

యువత, విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలని రాజకీయ ఉద్ధండులు పిలుపునివ్వడం చూస్తుంటాం. అలా ప్రజాశ్రేయస్సు కోసం ఏకంగా రూ.1.25కోట్ల ఉద్యోగాన్ని వదిలొచ్చి పోటీ చేసి ఓడిపోయాడో యువకుడు. ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం కోల్‌కత్తాలో చదివి జర్మనీలో ఉద్యోగం చేస్తోన్న శశాంత్ శేఖర్ కాంగ్రెస్ తరఫున బిహార్ ఎన్నికల్లో పోటీ చేశారు. పట్నా సాహిబ్‌లో బీజేపీ అభ్యర్థి రత్నేష్ కుమార్ చేతిలో ఆయన 38,900 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
News November 19, 2025
వెంకటపాలెం: సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నెల 27వ తేదీన రెండవ ప్రాకారం నిర్మాణానికి సీఎం చంద్రబాబు హాజరవుతున్న విషయం తెలిసిందే. కలెక్టర్ తమీమ్ అన్సారీయా, ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో బుధవారం ఉన్నతాధికారుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ప్రశాంత వాతావరణంలో కార్యక్రమం జరిగేలా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులతో చర్చించారు.
News November 19, 2025
ఎనుమాముల మార్కెట్‌లో పల్లికాయ క్వింటా రూ.6,210

చాలా రోజుల తర్వాత వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు పల్లికాయ (వేరుశనగ) తరలివచ్చింది. ఈ క్రమంలో పచ్చి పల్లికాయ క్వింటాకు రూ. 6,210 ధర రాగా, సూక పల్లికాయ రూ.4,500 ధర పలికింది. మరోవైపు, మార్కెట్‌కి వచ్చిన మొక్కజొన్న (మక్కలు) ధర భారీగా తగ్గింది. సోమవారం రూ. 2,080 ఉన్న ధర, ఈ రోజు రూ. 2,030కి పడిపోయింది.


