News December 15, 2025
గోదావరిఖని: DEC 23న అరుణాచలానికి స్పెషల్ బస్సు

GDK నుంచి అరుణాచలానికి 7రోజుల యాత్ర ఏర్పాటు చేశారు. ఈ యాత్ర GDK బస్టాండు నుంచి DEC 23న ప్రారంభమై తిరిగి 29న చేరుకుంటుంది. యాత్రలో కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, పాతాళశేంబు, మధురై, రామేశ్వరం, శివకంచి, విష్ణుకంచి, జోగులాంబ దర్శనాలు చేసుకోవచ్చుని, ఒక్కరికి ఛార్జీ రూ.8000గా ఉంటుందని DM నాగభూషణం తెలిపారు. భోజన, వసతి ఖర్చులు ప్రయాణికులవే ఉంటాయని, టికెట్ల రిజర్వేషన్ కోసమ 7013504982ను సంప్రదించవచ్చు.
Similar News
News December 20, 2025
చిన్నారులకు HIV సోకిన రక్తం.. బాధ్యులకు ఏ శిక్ష విధించాలి?

MPలోని సాత్నా ప్రభుత్వాసుపత్రిలో తలసేమియా చిన్నారులకు రక్తమార్పిడి వేళ HIV సోకిన రక్తాన్ని ఎక్కించారు. రక్త సేకరణలో అజాగ్రత్తే దీనికి కారణం కాగా, బాధ్యులైన బ్లడ్ బ్యాంక్ ఇన్‌ఛార్జ్, ల్యాబ్ టెక్నీషియన్లు సస్పెండ్ అయ్యారు. అయితే చిన్నారుల బంగారు భవితను నాశనం చేసిన వీరికి ఏ శిక్ష విధిస్తే సరిపోతుంది? తమ పిల్లల్లైతే ఇలాగే చేస్తారా? తల్లిదండ్రులకు ఏం చెప్పి ఓదార్చగలం? అని నెటిజన్లు ఫైరవుతున్నారు.
News December 20, 2025
సంగారెడ్డి: ’21వ తేదీన జాతీయ లోక్ అదాలత్’

సుప్రీంకోర్ట్ ఉత్తర్వుల మేరకు ఈనెల 21న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర శుక్రవారం తెలిపారు. జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, జోగిపేట, నారాయణఖేడ్ కోర్టులలో కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ప్రజలు, కక్షిదారులు లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News December 20, 2025
బాపట్ల జిల్లా పోలీసులకు ప్రతిష్ఠాత్మక రాష్ట్రస్థాయి అవార్డ్

జిల్లా పోలీసులకు ప్రతిష్ఠాత్మక రాష్ట్రస్థాయి అవార్డు వరించింది. శుక్రవారం రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో ఎస్పీ ఉమామహేశ్వర్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నుంచి అవార్డు ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ అందుకున్నారు. కొందరు పర్యాటక శాఖకు చెందిన వెబ్ సైట్లను పోలిన నకిలీ సైట్లను సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ కేసులను సమర్థవంతంగా చేదించినందుకు డీజీపీ అవార్డును అందించినట్లు వివరించారు.


