News February 28, 2025
గోదావరిలో గల్లంతైన యవకులు మృతి

భద్రాచలం గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయిన విషయం తెలిసిందే. అయితే గల్లంతయిన ఇద్దరు యువకులు మృతి చెందారు.జ వారి మృతదేహాలను గజఈతగాళ్లు వెలికి తీశారు. మృతులు పవన్(20), హరి ప్రసాద్(18) గా పోలీసులు గుర్తించారు.
Similar News
News February 28, 2026
క్యూబాను స్నేహపూర్వకంగా స్వాధీనం చేసుకుంటాం: ట్రంప్

వెనిజులా అధ్యక్షుడు మదురో అరెస్ట్, గ్రీన్‌లాండ్‌పై బెదిరింపుల తర్వాత US అధ్యక్షుడు ట్రంప్ కన్ను క్యూబాపై పడింది. ఆ దేశాన్ని స్నేహపూర్వకంగా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. విదేశాంగ కార్యదర్శి రూబియో ఆ దేశ నాయకులతో చర్చలు జరుపుతున్నారన్నారు. ‘నేను చిన్నప్పటి నుంచి క్యూబా గురించి వింటున్నా. అదొక విఫల దేశం. డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. వారు మా సాయం కోరుకుంటున్నారు’ అని చెప్పారు.
News February 28, 2026
తిరుపతిలో బస్సుల దారి మళ్లింపు

తిరుపతి రూరల్ తనపల్లి వద్ద జాతీయ రహదారి విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. దీంతో ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. TPT సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి చిత్తూరు, కాణిపాకం, బెంగళూరు వెళ్లే బస్సులను దారి మళ్లించారు. సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి తిరుమల బైపాస్ రోడ్డు, అలిపిరి, టౌన్ క్లబ్ మీదుగా హైవేపైకి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.
News February 28, 2026
నెల్లూరు: ప్రతి ఒక్కరికీ 125 పనిదినాలు

వీబీ జీ రాంజీ చట్టంపై మార్చి 27వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు నెల్లూరు డ్వామా పీడీ గంగాభవాని తెలిపారు. నెల్లూరులోని తన కార్యాలయం నుంచి వివిధ మండలాల అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. నూతన చట్టం ప్రకారం 125 రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. గ్రామసభల్లో వివిధ అంశాలపై ప్రజలకు అన్ని వివరాలు వెల్లడించాలని ఆదేశించారు.


