News January 25, 2025

గోదావరిలో గుర్తు తెలియని మృతదేహం

image

రావులపాలెం – జొన్నాడ బ్రిడ్జిల మధ్య గోదావరి నదిలో శనివారం గుర్తు తెలియని పురుషుని మృతదేహం లభ్యమైందని ఎస్ఐ చంటి తెలిపారు. మృతుడు 5 అడుగుల పొడవు కలిగి ఒంటిపై ఎరుపు రంగు షర్టు, అపోలో టైర్ టీ షర్ట్, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని తెలిపారు. వయసు సుమారు 35- 40 సంవత్సరాలు ఉండొచ్చని, మృతుని వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Similar News

News January 8, 2026

HYD: RTC స్పెషల్ బస్సులు.. 50% స్పెషల్ రేట్లు

image

సిటీ నుంచి సంక్రాంతికి సొంతూరికి వెళ్లేందుకు నగరవాసి సిద్ధమవుతున్నాడు. అయితే ఆర్టీసీ ప్రత్యేకంగా నడుపుతున్న బస్సుల్లో ప్రత్యేక బస్సుల్లో ప్రత్యేక టికెట్ ధరలు ఉంటాయి. అంటే అదనంగా 50% వసూలు చేస్తారన్నమాట. పండగ సమయాల్లో అదనపు ఛార్జీ వసూలుకు సంబంధించి గతంలోనే ప్రభుత్వం అనుమతులిస్తూ జీవో 50 జారీ చేసింది. ఈ మేరకు స్పెషల్ రేట్స్ ఉంటాయి. అయినా.. అవసరం ప్రజలది.. అవకాశం పాలకులది కదా.

News January 8, 2026

హార్దిక్ విధ్వంసం.. 31 బంతుల్లోనే

image

విజయ్ హజారే ట్రోఫీలో హార్దిక్ పాండ్య(బరోడా) సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నారు. ఇవాళ చండీగఢ్‌పై 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన ఆయన మొత్తంగా 31 బాల్స్‌లో 75 రన్స్(9 సిక్సర్లు, 2 ఫోర్లు) బాదారు. ప్రియాంశ్(113), విష్ణు(54), జితేశ్(73) రాణించడంతో బరోడా 391 రన్స్ చేసింది. కాగా విదర్భపై తొలి మ్యాచ్‌లోనూ హార్దిక్ 92 బంతుల్లో 133 రన్స్(11 సిక్సర్లు, 8 ఫోర్లు) చేసిన విషయం తెలిసిందే.

News January 8, 2026

ఉల్లికాడలతో ఎన్నో లాభాలు

image

ఉల్లికాడలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మహిళల ఎముకలు దృఢంగా ఉండాలంటే సి విటమిన్ ఉన్న ఈ ఉల్లికాడలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దగ్గూ, జలుబూ రాకుండా చూస్తాయి. రక్తంలోని షుగర్, గ్లూకోజ్ శాతాన్ని అదుపులో ఉంచడంతో పాటు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడకుండా కాపాడతాయి. అలాగే ఇవి కంటి చూపునూ మెరుగుపరుస్తాయి.