News April 1, 2025
గోదావరిలో దూకేసిన వ్యక్తి మృతదేహం లభ్యం

అప్పుల భారంతో అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామంలోని వైనతేయ వారధిపై కారును నిలిపి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న అమలాపురానికి చెందిన చోడపనీడి వెంకటేశ్వరరావు (61) మృతదేహం సోమవారం లభ్యమైంది. అంబాజీపేట మండలం తొండవరం గ్రామ పరిధిలో గోదావరి నది ఒడ్డున అతని మృతదేహాన్ని గుర్తించారు. వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అల్లవరం పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు.
Similar News
News October 27, 2025
తేమ 12% కంటే ఎక్కువ ఉంటే రూ. 6,950: కలెక్టర్

మార్కెట్ యార్డులో కొనుగోళ్లు నిలిచిపోవడంతో పత్తి రైతుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ రాజర్షి షా చొరవ తీసుకున్నారు. సోమవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్, వ్యాపారస్తులతో కలిసి రెండు గంటలు సమీక్షించారు. తేమ శాతం 12% కంటే ఎక్కువ ఉన్నా, ప్రైవేటు వ్యాపారుల ద్వారా క్వింటాలుకు ₹6,950 చెల్లించేలా ఒప్పందం కుదిరిందని కలెక్టర్ తెలిపారు. దీంతో రైతులకు ఊరట లభించింది.
News October 27, 2025
సైబర్ మోసాలకు గురికావొద్దు: వరంగల్ పోలీస్

పోలీస్, సీబీఐ అధికారులుగా సైబర్ నేరగాళ్లు మోసం చేసి, ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నేరగాళ్లు తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని, తమ పిల్లలు క్రిమినల్ కేసుల్లో చిక్కుకున్నారని అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇలాంటి కాల్స్‌కు భయపడకుండా, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకూడదని, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్‌ను సంప్రదించాలని పోలీసు శాఖ అప్రమత్తం చేస్తోంది.
News October 27, 2025
విటమిన్ Cతో మహిళలకు ఎన్నో ప్రయోజనాలు

మన శరీరానికి అవసరమైన పోషకాల్లో విటమిన్ C ఒకటి. ముఖ్యంగా స్త్రీలకు ఇది ఎంతో ముఖ్యం అంటున్నారు నిపుణులు. విటమిన్ సి తగ్గితే స్త్రీలకు డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. C విటమిన్‌తో కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. గర్భిణులు తీసుకుంటే శిశువులో లోపాలు రాకుండా ఉంటాయి. స్త్రీలలో ఈస్ట్రోజన్ స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల హార్మోన్ సమస్యలు, గర్భాశయ సమస్యలు ఉండవు.


