News December 1, 2025

గోదావరిలో మునిగి వెంకటపూర్ వ్యక్తి మృతి

image

మంథని మండలం వెంకటపూర్ గ్రామానికి చెందిన పంచిక సదానందం (44) ఆదివారం ఉదయం గోదావరిలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. బోనాల సందర్భంగా ఆరెంద గ్రామ సమీపంలోని నదికి వెళ్లిన అతడు నీటిలో కొట్టుకుపోయాడు. గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. మంథని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 2, 2025

మళ్లీ వేలంలోకి ‘HR88B8888’.. ఎందుకంటే?

image

హరియాణాలో ‘HR88B8888’ అనే వాహన రిజిస్ట్రేషన్ నంబర్ వేలంలో రూ.1.17 కోట్లు పలికి దేశవ్యాప్త చర్చకు దారితీసిన <<18396670>>విషయం<<>> తెలిసిందే. ఈ నంబర్‌ను తిరిగి వేలం వేయనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. 50,000 కనీస ధరతో ప్రారంభమైన గత ఆన్‌లైన్ వేలంలో 45 మంది బిడ్డర్లు పోటీ పడ్డారు. అయితే ఈ నంబర్‌ను సొంతం చేసుకున్న వ్యక్తి నిర్ణీత గడువులో డబ్బు చెల్లించలేదు. దీంతో మళ్లీ వేలంపాట నిర్వహిస్తున్నారు.

News December 2, 2025

తిరుపతిలో విషాదం.. ఓ ఇంట్లో మూడు మృతదేహాలు

image

తిరుపతి సమీపంలోని దామినేడులో విషాదం నెలకొంది. ఓ ఇంట్లో కుళ్లిన మూడు మృతదేహాలు కలకలం రేపాయి. ఇవి తమిళనాడు రాష్ట్రం, గుడియాత్తంకు చెందిన సత్యరాజ్, పొన్నాగుట్టె నాయగి, మనీశ్ మృతదేహాలుగా పోలీసులు గుర్తించారు. స్థానికులకు దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా.. మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 2, 2025

పాపవినాశనం డ్యాంపై శాస్త్రవేత్తల పరిశీలన

image

తిరుమలలోని పాపవినాశనం డ్యాంను ముగ్గురు శాస్త్రవేత్తలు సోమవారం పరిశీలించారు. డ్యాం సేఫ్టీ ఎవల్యూషన్లో భాగంగా జలవనరుల శాఖ, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి చెందిన శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు. నీటి నిల్వతో పాటు పలు జాగ్రత్తలపై రిమోట్ ఆపరేటింగ్ వెహికల్‌తో పరిశీలించారు.