News October 2, 2025

గోదావరిలో వృద్ధుడు గల్లంతు

image

నిడదవోలు మండలం పెండ్యాలలో గురువారం గోదావరి నదిలో ఓ వ్యక్తి గల్లంతైన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిరంజీవి (63) అనే వృద్ధుడు కాలకృత్యాలు తీర్చుకునేందుకు నది వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి నదిలో పడి కొట్టుకుపోయారని స్థానికులు తెలిపారు. దీంతో పోలీసులు జాలర్లసాయంతో నదిలో గాలిస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి కందుల దుర్గేశ్ స్పందించారు. గాలింపు చర్యలు మమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News October 2, 2025

తూ.గో జిల్లాకు మూడు రాష్ట్ర స్థాయి అవార్డులు

image

స్వచ్ఛ ఆంధ్రా-స్వర్ణ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 3 అవార్డులు, జిల్లా స్థాయిలో 51 అవార్డులు వచ్చాయని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. గురువారం ఈ మేరకు కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. స్వచ్ఛత కేటగిరీలో ప్రత్యేకంగా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌కి “స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు”తో ప్రత్యేక గుర్తింపు సాధించినట్లు కలెక్టర్ వెల్లడించారు.

News October 1, 2025

గ్రామ స్థాయిలో GST సూపర్ సేవింగ్స్ పై ప్రచారం తప్పనిసరి: కలెక్టర్

image

సెప్టెంబర్ 22 నుంచి ప్రభుత్వం అమలులోకి తెచ్చిన GST – సూపర్ సేవింగ్స్ పై గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం జరగాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. బుధవారం రాజమండ్రిలో ఆమె మాట్లాడారు. సంబంధిత అధికారులు అక్టోబర్ 19 వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజల్లోకి వెళ్లి తగ్గించిన ధరల లభ్యతపై స్పష్టత కల్పించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలు అందుబాటులో ఉన్నాయో లేదో తనిఖీలు చేయాలన్నారు.

News October 1, 2025

వైద్య సేవలకు ఆటంకం లేకుండా చర్యలు: కలెక్టర్

image

రాజమండ్రి: పీహెచ్‌సీలలో వైద్య సేవలకు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగేందుకు పీజీ వైద్యులు, ఇతర డాక్టర్లను నియమిస్తూ కలెక్టర్ కీర్తి చేకూరి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలకు నిరంతరాయ వైద్య సేవలు అందించేందుకు జిల్లా స్థాయి యంత్రాంగం సమన్వయంతో వైద్య ఆరోగ్య అధికారులు పని చేస్తున్నారని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.