News February 28, 2025

గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు

image

భద్రాచలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఓ యువకుడు మృతి చెందాడు. గల్లంతైన మరో యువకుడి కోసం గజఈతగాళ్లు గాలిస్తున్నారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 28, 2025

నంద్యాల జిల్లా టాప్ న్యూస్

image

☞ అతిసారాపై ప్రజలు ఆందోళన చెందొద్దు: నంద్యాల కలెక్టర్ ☞ ఆత్మకూరు ఘటనపై విచారణకు ఆదేశం: మంత్రి బీసీ☞ బడ్జెట్‌లో కలర్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ: బుగ్గన☞ ఇద్దరి మృతిపై ఎంపీ శబరి విచారం ☞ పోసాని అరెస్టును ఖండించిన కాటసాని☞ నీటి తొట్టిలో పడి బాలుడి మృతి☞ బడ్జెట్ అంకెల గారడీ: నరసింహ యాదవ్ ☞ యాగంటి రథోత్సవం ప్రారంభించిన మంత్రి బీసీ సతీమణి 

News February 28, 2025

వరంగల్: దశాబ్ద కాలం కోరిక నెరవేరింది: మంత్రి సురేఖ

image

వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జిల్లా వాసులకు దశాబ్ద కాలం కోరిక నెరవేరిందని మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. ఇది సీఎం రేవంత్, ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వరంగల్ జిల్లా ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. ఓరుగల్లు వాసులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కలను నెరవేర్చే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేసిందన్నారు.

News February 28, 2025

GWL: ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: సీఎస్

image

మార్చి 5 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కేంద్రాల్లోనికి మొబైల్స్ అనుమతించరాదన్నారు. గద్వాల కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

error: Content is protected !!