News December 10, 2025

గోదావరి క్రీడా సంబరాలపై అధికారులతో జేసీ సమీక్ష

image

గోదావరి క్రీడా సంబరాల భాగంగా నిర్వహిస్తున్న పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల టీంల ఎంపికను ప్రారంభించాలని జేసీ రాహుల్ అన్నారు. బుధవారం జేసీ ఛాంబర్‌లో గోదావరి క్రీడా సంబరాల ఏర్పాట్లపై డీఆర్ఓ, ఆర్డీవోలు, వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు 3,300 మంది అధికారులు, ఉద్యోగులు నమోదు చేసుకున్నారన్నారు. క్రికెట్, క్యారమ్స్, టెన్నిస్ విభాగాల్లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు

Similar News

News December 10, 2025

మొగల్తూరులో యాక్సిడెంట్..ఒకరు స్పాట్ డెడ్

image

వ్యాన్ ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన మొగల్తూరు (M) పేరుపాలెం సౌత్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నర్సింహరావు (75) అనే వృద్ధుడు సైకిల్‌పై వెళ్తుతుండగా ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వై.నాగలక్ష్మి తెలిపారు. డెడ్ బాడీని పోస్టుమార్టానికి నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News December 10, 2025

రాయకుదురు: ‘టెన్త్ విద్యార్థులకు వంద రోజుల ప్రణాళిక అమలు చేయాలి’

image

పదో తరగతి విద్యార్థులకు నిర్ణయించిన ప్రణాళికను అనుసరించి వంద రోజుల ప్రణాళికను అమలు చేయాలని ఉపవిద్యా శాఖ అధికారి ఎన్. రమేష్ అన్నారు. బుధవారం రాయకుదురు జడ్పీ హైస్కూల్‌ను ఆయన తనిఖీ చేశారు. హై స్కూల్ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ హైస్కూళ్లకు చెందిన హెచ్ఎంలతో పాటు సబ్జెక్టులకు సంబంధించిన ప్యానల్ మెంబర్స్‌తో సమావేశం నిర్వహించారు. విద్యాభివృద్ధికి పలు సూచనలు ఇచ్చారు.

News December 10, 2025

పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి: కలెక్టర్

image

పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధికి నూతన పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం ఆమె కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఇన్వెస్టర్లతో ముఖాముఖి మాట్లాడారు. నూతన పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు, బ్యాంకు రుణాల మంజూరుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.