News March 4, 2025
గోదావరి గడ్డపై తొలిసారి గెలవబోతున్న టీడీపీ..!

గోదావరి గడ్డపై పట్టభద్రుల MLC స్థానంలో టీడీపీ నుంచి తొలివిజయం నమోదు కానుంది. 2007లో శాసనమండలి ఏర్పడ్డాక 2007, 2013, 2019 గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. గోదావరి జిల్లాలో గత 3సార్లు పీడీఎఫ్ లేదా ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. అలాంటి గోదావరి గడ్డపై రాజశేఖరం గెలుపు దాదాపు ఖరారైంది. 80వేల ఓట్లు మెజార్టీ సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం 41,153 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
Similar News
News December 18, 2025
షూటింగ్‌లో ప్రమాదం.. హీరో ఆదికి గాయాలు?

‘శంబాల’ షూటింగ్‌లో భాగంగా భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో హీరో ఆది సాయికుమార్ గాయపడినట్లు తెలుస్తోంది. గాయాలతోనే ఆయన షూటింగ్ కంప్లీట్ చేసి ఆస్పత్రికి వెళ్లినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ సినిమాకు యుగంధర్ దర్శకత్వం వహిస్తుండగా అర్చన, స్వాసిక, రవివర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. DEC 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
News December 18, 2025
చంద్రబాబు గ్రాఫ్ పడిపోతోంది: జగన్

AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చేపట్టిన ఉద్యమం గ్రాండ్ సక్సెస్ అయిందని YCP చీఫ్ జగన్ పేర్కొన్నారు. ‘CBN గ్రాఫ్ పడిపోతోంది. దీనికి కలెక్టర్లే కారణమని ఆయన అనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ప్రైవేటీకరణే స్కామ్ కాగా సిబ్బందికి రెండేళ్ల పాటు జీతాలు GOVT ఇవ్వాలనుకోవడం మరో పెద్ద స్కామ్. వీటిపై కోర్టుకెళ్తాం. YCP అధికారంలోకి రాగానే వీటిని రద్దుచేస్తాం. బాధ్యులను 2 నెలల్లో జైల్లో పెడతాం’ అని హెచ్చరించారు.
News December 18, 2025
నంద్యాల జిల్లా ఇంఛార్జ్‌గా సీహెచ్ శ్రీధర్

రాష్ట్రంలోని 5 జిల్లాలకు జిల్లా ఇంఛార్జ్‌లుగా సీనియర్ IAS అధికారులను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల జిల్లా ఇంఛార్జ్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి సీహెచ్ శ్రీధర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లాలోని అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాల అమలు తీరును ఈయన స్వయంగా పర్యవేక్షించనున్నారు.


