News January 12, 2026
గోదావరి జిల్లాల్లో కోడి పందేలు అలా మొదలయ్యాయి అండి.. ఆయ్!

గోదావరి జిల్లాల కోడిపందేలకు శతాబ్దాల ఘన చరిత్ర ఉంది. పలనాటి యుద్ధంలో వీరత్వానికి, పౌరుషానికి ప్రతీకలుగా నిలిచిన ఈ పందేలను మన గోదావరి జిల్లాలు ఆదరించాయి. రాజులు, సైనికుల్లో యుద్ధకాంక్షను, ఉత్తేజాన్ని నింపేందుకు ప్రారంభమైన ఈ క్రీడ, కాలక్రమేణా మన జిల్లా సంక్రాంతి సంబరాల్లో విడదీయలేని అంతర్భాగమైంది. ఉభయ గోదావరి ప్రాంత ఆభిజాత్యానికి, సంస్కృతికి అద్దం పడుతూ ప్రత్యేక గుర్తింపును పొందాయి.
Similar News
News February 2, 2026
TODAY HEADLINES

* నిర్మలమ్మ పద్దు.. ₹53.47 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్
* రైల్వేకు రికార్డు స్థాయిలో ₹2,93,030 కోట్లు
* ఇది చరిత్రాత్మక బడ్జెట్: PM
* ఉద్యోగాలు లేవు.. రైతులకు ఊరట లేదు: రాహుల్
* దేశం అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగేలా బడ్జెట్: CBN
* కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం: భట్టి
* కేసీఆర్‌ను 4.50 గంటలు విచారించిన సిట్
* T20WC: INDతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసిన పాక్
* కవలలకు జన్మనిచ్చిన రామ్‌చరణ్ దంపతులు
News February 2, 2026
FIR రద్దు చేయాలంటూ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు

అంబటి రాంబాబు తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. అంబటిపై నమోదైన ఎఫ్ఐఆర్ చెల్లదని, వెంటనే రద్దు చేయాలని కోరారు. నమోదైన సెక్షన్లు అన్నీ ఏడు సంవత్సరాలలోపు శిక్షకు సంబంధించినవేనని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, హైకోర్టు సర్కులర్ ప్రకారం ముందస్తు విచారణ, ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి అని, 41ఏ నోటీసు ఇవ్వకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వాదించారు.
News February 2, 2026
BREAKING: అంబటికి 14 రోజుల రిమాండ్

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం, పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు మధ్య ఆయన్ను గుంటూరు జిల్లా న్యాయస్థానంలోని స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు భారీగా జిల్లా కోర్టు వద్దకు చేరుకున్నారు. ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తున్నట్లు సమాచారం.


