News January 12, 2026
గోదావరి జిల్లాల్లో కోడి పందేలు అలా మొదలయ్యాయి అండి.. ఆయ్!

గోదావరి జిల్లాల కోడిపందేలకు శతాబ్దాల ఘన చరిత్ర ఉంది. పలనాటి యుద్ధంలో వీరత్వానికి, పౌరుషానికి ప్రతీకలుగా నిలిచిన ఈ పందేలను మన గోదావరి జిల్లాలు ఆదరించాయి. రాజులు, సైనికుల్లో యుద్ధకాంక్షను, ఉత్తేజాన్ని నింపేందుకు ప్రారంభమైన ఈ క్రీడ, కాలక్రమేణా మన జిల్లా సంక్రాంతి సంబరాల్లో విడదీయలేని అంతర్భాగమైంది. ఉభయ గోదావరి ప్రాంత ఆభిజాత్యానికి, సంస్కృతికి అద్దం పడుతూ ప్రత్యేక గుర్తింపును పొందాయి.
Similar News
News January 27, 2026
ఉమ్మడి ప్రకాశం: గురుకులాల్లో ప్రవేశాలు

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 13 గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి ప్రవేశపరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ జయ తెలిపారు. ఈ మేరకు ఆమె మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఇతర వివరాలకు, అలాగే దరఖాస్తు చేసుకునేందుకు http://apgpcet.apcfss.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని, అర్హులు ఫిబ్రవరి 19లోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు.
News January 27, 2026
ధాన్యం నిల్వలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

ధాన్యాన్ని పరిశుభ్రమైన, పొడి గోనె సంచుల్లో నిల్వ చేయాలి. సంచులు గోడల నుంచి నేల నుంచి తేమ పీల్చుకోకుండా జాగ్రత్త పడాలి. ధాన్యాన్ని 1-2 అడుగుల ఎత్తు గల దిమ్మల మీద గాని బెంచీల మీద గాని పెడితే నేలలో తేమను సంచులు పీల్చుకోవు. కీటకాల నుంచి ధాన్యం రక్షణకు నిపుణుల సూచన మేరకు అప్పుడప్పుడు పొగబెట్టడం మంచిది. ఎలుకలను కట్టడి చేయకుంటే అవి ధాన్యాన్ని తినేస్తూ వాటి విసర్జనలు, వెంట్రుకలతో కలుషితం చేస్తాయి.
News January 27, 2026
జాతీయ క్రీడలకు ఉమ్మడి మెదక్ జిల్లా క్రీడాకారులు

తమిళనాడులో ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు జాతీయ జూనియర్ బాల్ బ్యాడ్మెంటన్ ఛాంపియన్‌షిప్ జరుగుతుందని వర్కింగ్ ప్రెసిడెంట్ గొట్టం బైరయ్య అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా బాల్ బ్యాడ్మెంటన్ బాలికల జట్టు నుంచి నిహారిక, రాధిక, గాయత్రి, బాలుర జట్టు నుంచి భరత్ తెలంగాణ జట్టుకు ఎంపికయ్యారని తెలిపారు. వారు మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో రాణించాలని క్రీడాకారులకు సూచించారు.


