News August 15, 2025

గోదావరి నదిని పరిశీలించిన కలెక్టర్

image

ఇబ్రహీంపట్నం మం. ఎర్దండి గ్రామ శివారులోని గోదావరి నదిని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం పరిశీలించారు. గతేడాది గోదావరి నది వరదతో ఉప్పొంగినప్పుడు తీసుకున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే భారీవర్షాల నేపథ్యంలో నదిలో వరద ఉప్పొంగితే తీసుకోవలసిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి RDO శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News August 15, 2025

ములుగు: స్వతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలు ఇవే..

image

జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకల షెడ్యూల్‌ను అధికారులు వెల్లడించారు. ఉదయం 8:45 గంటలకు వేడుకల ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క వేదిక వద్దకు చేరుకుంటారన్నారు. 9 గంటలకు జాతీయ పతాకావిష్కరణ, 9:30 గంటలకు అతిథుల ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, 10 గంటలకు లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ, 10:30 గంటలకు ఉత్తమ ఉద్యోగులకు అవార్డుల పంపిణీ ఉంటాయని వెల్లడించారు.

News August 15, 2025

గురుకులాల్లో సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సిలింగ్: ITDA PO

image

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5 నుంచి 9వ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సిలింగ్ ఉంటుందని ఐటీడీఏ పీవో రాహుల్ తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఉమ్మడి ఖమ్మం జిల్లాలలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీ చేపడుతున్నట్టు చెప్పారు. ఈనెల 19న బాలికలకు, 20న బాలురకు భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాలలో స్పాట్ కౌన్సిలింగ్ ఉంటుందన్నారు.

News August 15, 2025

ఆగస్టు 15: చరిత్రలో ఈ రోజు

image

1769: ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ జననం
1872: యోగి, జాతీయవాది శ్రీ అరబిందో(ఫొటోలో) జననం
1945: నటుడు రాళ్లపల్లి వెంకట నరసింహరావు జననం
1947: భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం
1961: సినీ నటి సుహాసిని జననం
1964: సినీ నటుడు శ్రీహరి జననం
1971: బహ్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవం
1975: భారత మాజీ క్రికెటర్ విజయ్ భరద్వాజ్ జననం
2018: భారత మాజీ క్రికెటర్ అజిత్ వాడేకర్ మరణం