News January 9, 2026

గోదావరి నది హారతికి మంచి స్పందన: కలెక్టర్

image

గత రెండు శనివారాలలో భద్రాచలం గోదావరి ఘాట్ వద్ద నిర్వహించిన నది హారతి కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ప్రజల సౌకర్యం, స్థానిక సంప్రదాయాల పరిరక్షణ, అలాగే కార్యక్రమానికి మరింత విస్తృత భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో గోదావరి నది హారతి కార్యక్రమాన్ని ఇకపై ప్రతి ఆదివారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News February 20, 2026

ఈ మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వద్దు

image

మన ఇళ్లు, పొలాల గట్ల దగ్గర పెంచుకోదగ్గ మొక్కల్లో అరటి, బొప్పాయి, జామ, నిమ్మ, ఉసిరి, మునగ, అవిసె, పందిరి చిక్కుడు, బచ్చలి, గుమ్మడి, కరివేపాకు, కుంకుడు మొదలైనవి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఈ మొక్కలను ఒకసారి నాటితే ఎక్కువకాలం ఫలాలనిస్తాయి. వీటి పెంపకానికి పెద్దగా ఖర్చు కానీ, యాజమాన్యం కానీ అవసరం ఉండదు. ఇవి తక్కువ విస్తీర్ణంలో పెరుగుతూ ఎక్కువ పోషక విలువలు గల ఆహారాన్నిస్తూ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

News February 20, 2026

రేపు వినుకొండలో సీఎం షెడ్యూల్ ఇదే

image

CM చంద్రబాబు ఈనెల 21న పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్‌లో వివాహ వేడుకలకు హాజరై, మధ్యాహ్నం 12:40 గంటలకు హెలికాప్టర్ ద్వారా వినుకొండ చేరుకుంటారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రజల నుంచి స్వాగతం స్వీకరిస్తారు. అనంతరం ప్రజా వేదికలో స్వచ్ఛ రథాన్ని ప్రారంభించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పార్టీ కేడర్ సమావేశం, సీహెచ్‌సీ కార్యక్రమాల అనంతరం సాయంత్రం ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.

News February 20, 2026

విజయ్‌పై బీజేపీ ఒత్తిళ్లు.. అయినా పొత్తు ఉండదు: TVK

image

రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో BJPతో పొత్తు వార్తలను TVK పార్టీ జనరల్ సెక్రటరీ అరుణ్ రాజ్ ఖండించారు. సినిమా వివాదాలు, తొక్కిసలాటపై CBI విచారణ పేరుతో విజయ్‌కు BJP నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని తెలిపారు. మతతత్వ పార్టీలతో కలిసేది లేదని, దేశంలో, రాష్ట్రంలోని అధికార పార్టీలు తన ప్రత్యర్థులని విజయ్ ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడటం లేదన్న ఆరోపణలను తోసిపుచ్చారు.