News December 31, 2025
గోదావరి నీటి మళ్లింపును అంగీకరించం: ఉత్తమ్

TG: AP ప్రణాళికలను అడ్డుకొని రాష్ట్ర నీటి వాటాను పరిరక్షించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు. ‘గోదావరి నీళ్ల మళ్లింపును అంగీకరించం. ఏకపక్షంగా మళ్లించేందుకు ప్రయత్నిస్తే సహించే ప్రసక్తే లేదు. వారి నిర్ణయం CWC, GWDT తీర్పునకు భిన్నంగా ఉంది. అదనపు నీటి హక్కుల కోసం AP రూపొందించిన ప్రణాళికలకు వ్యతిరేకంగా ప్రభుత్వం న్యాయ పోరాటానికి పూనుకుంది. ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదు’ అని తెలిపారు.
Similar News
News January 2, 2026
HYD: ‘మీ సోకు మేం క్యాష్ చేస్కుంటాం’

ధరల పెంపుతో స్మోకర్స్‌కు ముందే ‘పొగ’ పెడుతున్నారు వ్యాపారులు. సిగరెట్లపై 40% పన్ను పెంచుతున్నట్లు కేంద్రం చెప్పడమే లేట్ నగరంలో నోస్టాక్ అంటూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ప్యాకెట్‌పై ₹10 సింగిల్‌గా ₹2 ఎక్స్‌ట్రా గుంజుతున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి ముందే వ్యాపారుల దోపిడీతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంటే ఎవరిని ప్రశ్నించాలని వాపోతున్నారు. వాస్తవంగా పెరిగిన ధరలు FEB-1 నుంచి అమల్లోకి రావాలి.
News January 2, 2026
రేపు అసెంబ్లీలో కృష్ణా జలాలపై ప్రభుత్వం PPT

తెలంగాణ అసెంబ్లీలో కృష్ణా జలాలపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు ప్రజెంటేషన్ ఇస్తారు. కృష్ణా జలాలు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇవాళ సభకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ తీరును నిరసిస్తూ సమావేశాలను బహిష్కరించారు.
News January 2, 2026
వాస్తు మన సౌభాగ్యానికి తొలి మెట్టు

వాస్తు నియమాలు పాటించే ఇంట్లో సిరిసంపదలకు లోటుండదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. సరైన వాస్తు వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడి, మనసులో ప్రభావవంతమైన ఆలోచనలు కలుగుతాయని అంటున్నారు. ‘ఇవి కొత్త అవకాశాలను సృష్టిస్తాయి. ఆదాయ వృద్ధికి బాటలు వేసి సకల సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తాయి. అంతిమంగా ఇవి ఆనందాన్ని, మానసిక సంతృప్తిని అందిస్తాయి. వాస్తు అభ్యున్నతికి ఆధారం’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


