News October 9, 2025
గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై జేసీ రాహుల్ సమీక్ష

భీమవరం కలెక్టరేట్‌లో 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి జిల్లా అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. యాత్రికుల సౌకర్యార్థం 42 పుష్కర ఘాట్లకు సంబంధించిన మరమ్మతులు, అప్రోచ్ రోడ్లు, తాగునీరు, శానిటేషన్, లైటింగ్, టాయిలెట్స్ పనులు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. రేపట్లోగా పనుల నివేదిక సమర్పించాలని జేసీ కోరారు.
Similar News
News October 9, 2025
రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటు: డిప్యూటీ స్పీకర్

పద్మవిభూషణ్ రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. గురువారం రతన్ వర్ధంతి సందర్భంగా పెద అమిరంలోని ఆయన విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. పారిశ్రామిక రంగానికే కాక, ప్రపంచానికే ఆయన ఆదర్శంగా నిలిచారన్నారు. గొప్ప మానవతావాదిగా ఆయన సమాజానికి చేసిన సేవలు అనిర్వచనీయమని రఘురామ కృష్ణంరాజు కొనియాడారు.
News October 9, 2025
ఏలూరు: యువతికి వేధింపులు.. యువకుడి అరెస్టు

ఏలూరు వన్‌టౌన్‌లోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతున్న యువతిని ప్రేమించాలంటూ వేధిస్తున్న సాయి అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కళాశాలకు వచ్చి వెళ్లే సమయంలో సాయి వెంటపడటంతో, బాధితురాలు శక్తి టీమ్‌కు ఫిర్యాదు చేసింది. అతడిని పట్టుకున్న శక్తి టీం, వన్‌టౌన్ పోలీసులకు అప్పగించింది. సాయిపై కేసు నమోదు చేశామని, సహకరించినందుకు యువతి కృతజ్ఞతలు తెలిపిందని సీఐ సుబ్బారావు గురువారం వెల్లడించారు.
News October 9, 2025
లఘు చిత్రాల పోటీకి ఈనెల 15 వరకు గడువు: కలెక్టర్

ఆంధ్ర యువ సంకల్ప్ -25- అంబాసిడర్” డిజిటల్ మారథాన్ కార్యక్రమంలో ”యువ సంకల్ప్” లఘు చిత్రాల పోటీకి గడువు పెంపును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఈనెల 15 వరకు పొడిగించడం జరిగిందన్నారు. ఏదైనా సందేహాలు ఉంటే సెట్వెల్ కార్యాలయం 7075230609 నంబర్‌కు సంప్రదించాలన్నారు. ముందుగా www.andhrayuvasankalp.com వెబ్ సైట్‌లో రిజిస్టర్ కావాలన్నారు.