News April 22, 2025

గోపాలపట్నంలో ఈనెల 24న మెగా జాబ్ మేళా

image

గోపాలపట్నంలో ఈనెల 24న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ మేళాలో 54 కంపెనీలు పాల్గొనున్నాయి. గోపాలపట్నం ఎస్.వి.ఎల్.ఎన్. జడ్పీ హై స్కూల్‌లో నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ చదివిన వారు అర్హులు. ఆసక్తి గల వారు https://naipunyam.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. >Share it

Similar News

News November 12, 2025

విశాఖలో మరో ఐటీ క్యాంపస్‌‌ ఏర్పాటు

image

విశాఖలో మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటు కానుంది. కాపులుప్పాడలో రూ.115 కోట్లతో.. 2,000 మందికి ఉద్యోగాలిచ్చే విధంగా క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ లిమిటెడ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అడ్వాన్స్‌డ్ డిజిటల్ ఇంజినీరింగ్, AIML, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీతో క్యాంపస్ నిర్మించనున్నారు. ఎకరం రూ.కోటి చొప్పున, 4 ఎకరాలు భూమిని ప్రభుత్వం కేటాయించింది. రెండేళ్లలో తొలి దశ కార్యకలాపాలు ప్రారంభించాలని ఆదేశాలిచ్చింది.

News November 12, 2025

విశాఖలో నేటి నుంచి డ్రోన్ ఎగురవేయుట నిషేదం

image

విశాఖలో భాగస్వామ్య సదస్సులు జరగనున్న నేపథ్యంలో నగరవాసులకు సీపీ శంఖబ్రత బాగ్చి మంగళవారం పలు సూచనలు చేశారు. ఈనెల 12వ తేదీ నుుంచి 16వ తేదీ వరకు ఏయూ నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్ ఎగురవేయట నిషేధమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని విశాఖ ప్రజలు గమనించాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా డ్రోన్ ఎగురవేస్తే చట్టప్రకారమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

News November 11, 2025

విశాఖ: అబార్షన్ కిట్ అమ్ముతున్న మెడికల్ షాప్‌పై కేసు

image

డాక్టర్ మందులు చీటీ లేకుండా గర్భాన్ని తొలగించేందుకు వాడే మందులను అమ్ముతున్న మెడికల్ షాప్‌పై విశాఖ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దాడులు చేశారు. సీపీ సూచనలతో గోపాలపట్నంలోని దర్విన్ ఫార్మసీపై మంగళవారం దాడులు చేయగా ఆరు కిట్లు స్వాధీనం చేసుకున్నట్లు సిబ్బంది తెలిపారు. దుకాణంపై కేసు నమోదు చేసి మందులను డ్రగ్ కంట్రోలర్ అప్పగిస్తామని వెల్లడించారు.