News April 5, 2024

గోపాలపట్నం: ఎండ వేడి తాళలేక వృద్ధుడి మృతి

image

జీవీఎంసీ 91వ వార్డు లక్ష్మీనగర్‌కి చెందిన తీడ బాబూరావు (65) కాకినాడలోని తన సోదరుడి వద్ద ఉంటున్నాడు. విశాఖలోని వార్డు సచివాలయం(482) పరిధిలో ప్రతి నెలా పింఛను పొందుతున్నాడు. ఈనెల పింఛను కోసం గురువారం కాకినాడ నుంచి విశాఖ వచ్చి, గోపాలపట్నంలోని సచివాలయం వద్దకు వెళ్తున్నాడు. ఇంతలో బీఆర్టీఎస్ రోడ్డులో ఎండ తీవ్రతకు తాళలేక సొమ్మసిల్లి పడిపోయి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 21, 2025

రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం అందజేత: విశాఖ సీపీ

image

విశాఖ సీపీ కార్యాలయంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా శుక్రవారం పరిహారం అందజేశారు. హిట్‌అండ్‌రన్ కేసులో మరణించిన విజయనగరానికి చెందిన భవిరిశెట్టి రేవతి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు జమ చేశారు. గాయపడ్డ గాజువాకకు చెందిన నాగేశ్వరరావుకు, శ్రీఖర్‌కు, సీతమ్మధారకు చెందిన సత్యనారాయణకు రూ.50వేలు చొప్పున అందజేశారు. ఇప్పటివరకు 97 మందికి రూ.78.50 లక్షల పరిహారం అందించారు.

News November 21, 2025

జీవీఎంసీ సర్వసభ్య సమావేశంలో 131 అంశాలు ఆమోదం

image

జీవీఎంసీ సర్వసభ్య సమావేశం శుక్రవారం జీవీఎంసీ కౌన్సిల్ హాల్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో 131 అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అజెండాలలో గల 132 అంశాలను చర్చించి 131అంశాలు ఆమోదించగా, రెల్లివీధి పేరు మార్పు అంశాన్ని తిరస్కరించడమైనదని మేయర్ తెలిపారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జీవీఎంసీ అధికారులు కౌన్సిల్ హాల్‌లో ఉన్నారు.

News November 21, 2025

విశాఖ సిటీ పరిధిలో నలుగురు ఎస్ఐల బదిలీ: సీపీ

image

విశాఖ సిటీ పరిధిలో 4గురు సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ విశాఖ సీపీ శంక బ్రత బాగ్చి శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. దువ్వాడ L&O ఎస్‌ఐ శ్రీనివాస్‌ను ద్వారాక క్రైమ్‌కు, త్రీటౌన్ L&O ఎస్‌ఐ సంతోష్‌ను ద్వారక L&Oకు, ద్వారక క్రైమ్ ఎస్‌ఐ రాజును త్రీటౌన్ L&Oకు, ద్వారక L&O ఎస్‌ఐ ధర్మేంద్రను దువ్వాడ L&Oకు బదిలీ చేశారు.