News January 9, 2025

గోపాలపురం: ఐదుగురు డైరెక్టర్లు, ఇద్దరు డ్రైవర్లపై క్రిమినల్ కేసు నమోదు

image

గోపాలపురం(M) కొమటిగుంట రైస్ మిల్లులో బయటపడిన అక్రమ PDS బియ్యం ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సతీశ్ తెలిపారు. అధికారులకు రాబడిన సమాచారం మేరకు తనిఖీలు చేయగా మిల్లులో44 బస్తాల బియ్యం, లారీలో లోడ్ చేసున్న 580 బస్తాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. విలువ రూ.14,31,111 ఉంటుందన్నారు. ఐదుగురు మిల్లు డైరెక్టర్లు, ఇద్దరు డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, లారీని సీజ్ చేశామన్నారు.

Similar News

News February 28, 2026

నరసాపురంలో పెన్షన్ పంపిణీ చేసిన కలెక్టర్

image

నరసాపురంలోని బొండమ్మ మహిళా వృద్ధాశ్రమంలో శనివారం కలెక్టర్‌ నాగరాణి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 24 రకాల పింఛన్లకు సంబంధించి 2,22,980 మంది లబ్ధిదారులకు రూ.96.39 కోట్లను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. పింఛన్లతో పాటు వృద్ధులకు పండ్లను పంపిణీ చేసి వారికి భరోసానిచ్చారు.

News February 28, 2026

పాతకక్షల భగ్గు: భీమవరంలో దారుణ హత్య

image

2022 డిసెంబరులో రఘు సోదరుడు ఏసు హత్యతో రెండు వర్గాల మధ్య కక్షలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో 2023 సెప్టెంబర్ 17న గోవింద్, తన సోదరుడు విజయ్‌తో కలిసి భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వస్తుండగా.. గొల్లవానితిప్ప రోడ్డులోని కనకదుర్గ ఆలయం వద్ద రఘు తన అనుచరులతో కలిసి వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనలో విజయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, గోవింద్ అక్కడి నుంచి పరారయ్యాడు.

News February 28, 2026

భీమవరం: ఆహార భద్రతపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో కల్తీ ఆహార పదార్థాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో ఆహార భద్రత, పశుసంవర్ధక శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. గత రెండ్రోజులుగా జరుగుతున్న తనిఖీల వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్.. పాలు, నెయ్యి, వెన్న వంటి పదార్థాల్లో కల్తీని గుర్తించే విధానం, నమూనాల ల్యాబ్ పరీక్షలపై దిశానిర్దేశం చేశారు.