News March 14, 2025
గోపాలమిత్ర కుటుంబీకులకు లక్ష ఆర్థిక సహాయం

సిద్దిపేట మండలానికి చెందిన గోపాలమిత్ర మార్గడి వెంకట్ రెడ్డి కొద్దిరోజుల క్రితం మృతి చెందాడు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన గోపాలమిత్ర సభ్యులు ఈరోజు మృతుడి కుటుంబీకులకు రూ. లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా గోపాలమిత్ర అధ్యక్షులు పల్లెపాటి అశోక్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సింగం రాజు యాదవ్, రాష్ట్ర సలహాదారు శ్రీరాములు, మహిపాల్ రెడ్డి, రామస్వామి, సత్తార్, గౌరీ శంకర్ పాల్గొన్నారు.
Similar News
News March 14, 2025
మెదక్: చిరుత పులి దాడిలో లేగ దూడలు మృతి..?

మెదక్ జిల్లాలో చిరుత పులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. రామాయంపేట మండలం దంతేపల్లి శివారులోని నక్కిర్తి స్వామి పొలం వద్ద పశువుల పాకపై అర్ధరాత్రి అడవి జంతువు దాడి చేసి రెండు దూడలను చంపేసింది. అయితే చిరుత దాడితోనే దూడలు మృత్యువాత పడ్డాయని బాధితులు పేర్కొన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. అయితే దాడి చేసింది ఏ జంతువు అనేది తెలియాల్సి ఉంది.
News March 14, 2025
ఆపదలో ఉంటే 100కు ఫోన్ చేయండి: SP

మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని అన్నారు. ఆపద సమయాల్లో అధైర్యపడకుండా వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలన్నారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళలకు
ప్రశంసాపత్రాలు అందించారు.
News March 14, 2025
సిద్దిపేట జిల్లాలో బాలిక ఆత్మహత్య

జగదేవ్పూర్ మండలం మునిగడప గ్రామంలో కడుపునొప్పి భరించలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నర్ర బాలేశం, నాగలక్ష్మి దంపతుల కుమార్తె ప్రవళిక(13) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లి నిన్న తిరిగొచ్చింది. కడుపునొప్పి వస్తుందని తల్లికి చెప్పి ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.