News November 11, 2025
గోరంట్లలో రామరాయల శాసనం గుర్తింపు

గోరంట్లలోని శ్రీమాధవరాయ స్వామి గుడిలో శ్రీకృష్ణదేవరాయల అల్లుడైన అరవీటి రామరాయల శాసనాన్ని గుర్తించినట్లు చరిత్రకారుడు మైనాస్వామి చెప్పారు. సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. మాధవ రాయల గుడి ముఖ మండపం దక్షిణ ద్వారం పక్కన 9 అడుగుల పొడవు, 3.5 అడుగుల వెడల్పు గల పెద్ద తెలుగు దానశాసనాన్ని గుర్తించానన్నారు. ఇది 1559 నాటిదని వివరించారు.
Similar News
News November 11, 2025
నేడు ఘట్కేసర్‌లో అందెశ్రీ అంతక్రియలు.!

తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీ అకాల మరణం రాష్ట్ర ప్రజల గుండెలను కలచివేసింది. అందెశ్రీ పాడిన పాట, తెలంగాణ కోసం రాసిన రాతలతో పోరాట స్ఫూర్తిని నింపి ఉద్యమాన్ని ముందుకు నడపడంలోనూ కీలక భాగమయ్యారు. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లటం పట్ల తెలంగాణ పోరాట యోధులు శోకసంద్రంలో మునిగారు. నేడు ఆ మహానీయుడు అంతక్రియలు ఘట్కేసర్‌లో జరగనున్నాయి.
News November 11, 2025
మా తండ్రి చనిపోలేదు: ఈషా డియోల్

తన తండ్రి ధర్మేంద్ర చనిపోలేదని కూతురు ఈషా డియోల్ ప్రకటించారు. ఆయన చనిపోయినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. ధర్మేంద్ర మృతికి సంతాపం తెలుపుతూ సినీ ప్రముఖులు పోస్టులు పెట్టడంతో ఫ్యాన్స్‌తో పాటు మీడియా వర్గాలు ఆయన చనిపోయినట్లు భావించాయి. అయితే తాజాగా ఆయన కూతురు ధర్మేంద్ర చనిపోలేదని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.
News November 11, 2025
ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో మంగళవారం సీసీఐ పత్తి ధర క్వింటాల్ రూ.8,110గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,750గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేటు ధర రూ.50 తగినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలియజేశారు.


