News March 2, 2025
గోరంట్లలో విద్యుత్ షాక్‌తో రైతు మృతి

గోరంట్ల మండలం బూచేపల్లి గ్రామంలో శనివారం విద్యుత్ షాక్ తగిలి రైతు శివప్ప (33) అక్కడికక్కడే మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. వ్యవసాయ పొలంలో విద్యుత్ తీగలు నేలపై ఉండడంతో వాటిని ఎత్తులో కట్టేందుకు కట్టెలు నాటుతుండగా చేతికి విద్యుత్ తీగల తగిలి అక్కడికక్కడే మృతి చెందాడున్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు సీఐ శేఖర్ తెలిపారు.
Similar News
News November 4, 2025
ఘణపురం: కోటగుళ్లలో ఫ్రాన్స్ దేశస్థుల సందడి

కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో మంగళవారం ఫ్రాన్స్ దేశస్థులు సందడి చేశారు. ఫ్రాన్స్‌కి చెందిన ఎరిఫ్, ఎలిక్‌లు ఆలయాన్ని సందర్శించారు. మొదట స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ పరిసరాలు, అందాలను ఫొటోలు, వీడియోల రూపంలో బంధించారు. కోటగుళ్ల చరిత్రను ఆలయార్చకులు జూలపల్లి నాగరాజును వారు అడిగి తెలుసుకున్నారు. ఆలయ నిర్మాణం అద్భుతమని కొనియాడారు.
News November 4, 2025
త్వరలోనే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో టెస్ట్ ఫ్లైట్

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు 91.7% పూర్తయ్యాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ లేదా జనవరిలో టెస్ట్ ఫ్లైట్ జరగనుందని చెప్పారు. CM చంద్రబాబు ఈ ప్రాజెక్టును ఛాలెంజ్‌గా తీసుకుని కృతనిశ్చయంతో ముందుకు వెళ్తున్నారన్నారు. ఉత్తరాంధ్రలో ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
News November 4, 2025
జూబ్లీ గెలుపుపై రోజుకో సర్వే వెనుక రహస్యమేమి?

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై రోజుకో సర్వే విడుదలవుతోంది. ఇప్పటి వరకు 3 సర్వే సంస్థల నివేదికలు బయటకు వచ్చాయి. గెలుపుపై 2 బీఆర్ఎస్‌కు, 1 కాంగ్రెస్‌కు అనుకూలంగా చెప్పాయి. ఇవి వివాదంగా మారగా 2పార్టీలూ అధికారులకు ఫిర్యాదు చేశాయి. అయితే అనుకూలతను పెంచుకొనేందుకు పార్టీలే ఇలా సర్వే సంస్థల ద్వారా కొత్త ప్రచారం మొదలుపెట్టాయని కొందరు అనుమానిస్తున్నారు. ఈ సర్వేల ప్రభావం తటస్థ ఓటర్లపై పడొచ్చని అంటున్నారు.


