News December 20, 2025
గోరంట్ల: ఇద్దరికి రెండేళ్ల జైలు శిక్ష

కర్ణాటక మద్యం అక్రమంగా రవాణా చేస్తున్న గోరంట్లకు చెందిన చాకలి మురళి, వడ్డే నరేష్‌లకు పెనుకొండ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2020లో 192 హేవార్డ్స్ విస్కీ టెట్రా ప్యాకెట్లు తరలిస్తుండగా అప్పటి సీఐ జయనాయక్ వీరిని అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో మెజిస్ట్రేట్ బొజ్జప్ప నిందితులకు జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున భారీ జరిమానా విధించారు.
Similar News
News December 30, 2025
పోస్టల్ సర్వీసులు అద్భుతం.. నెటిజన్ సంతోషం

ఆధార్ అప్‌డేట్ విషయంలో పోస్టల్ సేవలపై ఓ నెటిజన్ ప్రశంసలు కురిపించారు. ఐదేళ్లు నిండిన తన బిడ్డ ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం 4 నెలలుగా స్లాట్ బుకింగ్‌కు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వెల్లడించారు. ఎక్కడ చూసినా స్లాట్లు లేవని.. చివరకు సమీపంలోని పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లగా కేవలం 30 నిమిషాల్లోనే పని పూర్తైందని ఆనందం వ్యక్తం చేశాడు. కొన్నిసార్లు తక్కువ అంచనా వేసిన వ్యవస్థలే ఉత్తమంగా పనిచేస్తాయన్నారు.
News December 30, 2025
నువ్వుల పంటపై పేనుబంక ప్రభావం – నివారణ

నువ్వుల పంట వేసిన 25 రోజుల నుంచి పంటలో ఈ పురుగు ఆశించడం జరుగుతుంది. పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం ద్వారా ఆకులు పాలిపోయి తర్వాత ఎండిపోతాయి. వాటి ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల నుంచి తేనె లాంటి జిగురు పదార్థం విడుదలై మొక్క చుట్టుపక్కల చీమలు చేరతాయి. ఈ పురుగు నివారణకు ఇమిడాక్లోఫ్రిడ్ 0.3ml లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
News December 30, 2025
NTR: కృష్ణా నదిలో ఇక సందడే సందడి..!

పర్యాటకుల కోసం కృష్ణా నదిలో కేరళ తరహా హౌస్‌బోట్లు సిద్ధమయ్యాయి. వీటిని జనవరి 8న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. రూ. 6-7 వేల ధరతో మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు విహరించవచ్చు. ఇందులో బెడ్‌రూమ్, భవాని ఐలాండ్‌లో బస, సూర్యోదయ, సూర్యాస్తమయ వీక్షణలు ప్రత్యేక ఆకర్షణ. త్వరలో రాజమండ్రి, సూర్యలంక, గండికోటల్లోనూ వీటిని అందుబాటులోకి తెస్తామని పర్యాటక శాఖ తెలిపింది.


