News January 17, 2026
గోరంట్ల మాధవ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్

అత్యాచార బాధితురాలి పేరు బయటపెట్టారంటూ నమోదైన కేసులో మాజీ MP గోరంట్ల మాధవ్‌పై విజయవాడ పోక్సో న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు మాధవ్‌పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆయన శుక్రవారం విచారణకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి వారెంట్ జారీ చేశారు. తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేశారు.
Similar News
News January 28, 2026
కశింకోట: హైవేపై యాక్సిడెంట్..ఒకరు స్పాట్ డెడ్

అనకాపల్లి జిల్లా కశింకోట మండలం నర్సింగబిల్లి వద్ద 16 నంబర్ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం యాక్సిడెంట్ జరిగింది. హైవేపై వెళ్తున్న బైక్‌ను లారీ ఢీకొనగా చోదకుడుకి రోడ్డుపై పడిపోయాడు. తలపై నుంచి లారీ వెళ్లడంతో ఆ భాగం నుజ్జువ్వగా వాహనదారుడు ప్రాణాలను వదిలాడు. లారీని ఆపకుండా డ్రైవర్ వెళ్లాడు. మృతుడు మంగళవారం నరసింగపల్లిలో బంధువుల ఇంటికి వచ్చినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 28, 2026
ICET షెడ్యూల్ విడుదల

TG: MBA, MCA కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ICET-2026 షెడ్యూల్ విడుదలైంది.
*ఫిబ్రవరి 6న నోటిఫికేషన్
*ఫిబ్రవరి 12 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు
*మార్చి 16- దరఖాస్తులకు చివరి తేదీ
*మే 13, 14న కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్
**అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.550, ఇతర అన్ని విభాగాల వారికి రూ.750. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులూ అప్లై చేసుకోవచ్చు.
News January 28, 2026
గద్వాల: ‘పీఎండీడీకేవైతో రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం’

పీఎండీడీకేవై (PMDDKY) పథకం ద్వారా రైతులు ఆర్థికంగా ఎదిగేలా కృషి చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ కాంత్ దూబే అధికారులకు సూచించారు. బుధవారం గద్వాల కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ పథకానికి గద్వాల జిల్లా ఎంపికైన నేపథ్యంలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో దీనిని సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.


