News March 11, 2025
గోలేటి ఏరియా స్టోర్‌లో చోరీ.. నలుగురు అరెస్ట్

గోలేటి ఏరియా స్పోర్ట్ చోరికి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తాండూర్ CI కుమారస్వామి తెలిపారు. మందమర్రికి చెందిన మోతే రాజయ్య, నరసయ్య, తిరుపతి, మధు జనవరి 8న గోలేటి ఏరియా వర్క్ షాప్‌లోని సింగరేణి అధికారులు నిల్వ ఉంచిన పరికరాలను దొంగలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశామన్నారు. వాటి విలువ 6.22లక్షలు ఉంటుందన్నారు.
Similar News
News April 13, 2026
నేడు RRతో SRH ఢీ.. పరుగుల వరద ఖాయం!

IPLలో ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది. భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ తలపడనున్నాయి. హైదరాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఆడిన 4 మ్యాచుల్లోనూ గెలిచి RR దూకుడు మీద ఉంది. పైగా వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ చెలరేగి ఆడుతున్నారు. మరోవైపు SRH 4 మ్యాచుల్లో 3 ఓటములు చవిచూసింది. నేటి మ్యాచులో గెలవాలని ఉవ్విళ్లూరుతోంది.
News April 13, 2026
KMR: రహదారులపై ధాన్యం ఆరబోతతో సమస్యలు

కామారెడ్డి జిల్లాలో వరి కోతల సీజన్ మొదలైంది. రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబోయడానికి కల్లాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే సులభంగా ఉంటుందని ప్రధాన రహదారులను కల్లాలు మారుస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయాలపై ప్రభుత్వం ప్రత్యామ్నాయలు అన్వేషించి, కఠిన నిబంధనలు, అవగాహనలు కల్పించి పరిష్కారమార్గాలు చూపిస్తే ప్రమాదాలకు నెలవుండదు.
News April 13, 2026
5 కేజీల సిలిండర్ల సరఫరా పెంపు

గ్యాస్ కొరతను నివారించేందుకు కేంద్రం 5 కేజీల LPG సిలిండర్ల సరఫరాను భారీగా పెంచింది. మార్చి 23 నుంచి 13 లక్షలకు పైగా సిలిండర్లను అమ్మింది. ప్రస్తుతం రోజువారీ సేల్స్ లక్ష యూనిట్లను దాటాయి. ఎక్కువగా వలస కార్మికులు వీటిని కొంటున్నారు. మరోవైపు మార్చి నుంచి 4.24 లక్షల PNG కనెక్షన్లను ప్రభుత్వం యాక్టివేట్ చేసింది. డొమెస్టిక్ LPG సరఫరా స్థిరంగా కొనసాగుతోంది. ఈ నెల 11న 52 లక్షల సిలిండర్లు డెలివరీ అయ్యాయి.


