News August 18, 2025

గోల్కొండ కోటను ఏలిన గౌడన్న

image

సర్వాయి పాపన్న గౌడ్.. గోల్కొండను ఏలిన వీరుడు. జనగామ(D) ఖిలాషాపూర్‌లో జన్మించాడు. పెద్దలను దోచి పేదలకు పంచిన ఈయన జమీందార్లలో వణుకు పుట్టించాడు. 12 మందితో మొదలైన పాపన్న దళం 12 వేలకు విస్తరించి, చివరకు గోల్కొండలో బహుజన జెండా ఎగరేశాడు. ఇది నచ్చని జమీందార్లు మొగల్ రాజును ఉసిగొల్పి, పాపన్న మీద దాడి చేయించారు. శతృవులు చంపారని కొందరు, పాపన్నే ప్రాణత్యాగం చేశారని మరికొందరు చెబుతారు.
నేడు పాపన్న గౌడ్ జయంతి.

Similar News

News August 17, 2025

HYD: వినాయకచవితి.. పోలీసుల సూచనలు

image

వినాయకచవితి నేపథ్యంలో పోలీసులు ఆర్గనైజర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి మండపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌లో పోలీసుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. DJల స్థానంలో సంప్రదాయంగా కళాకారులతో కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని హితవు పలికారు. ఆదివారం మొయినాబాద్ సీఐ పవన్ కుమార్ రెడ్డి గణేశ్ ఉత్సవ సమితి సభ్యులకు పలు సూచనలు చేశారు.
SHARE IT

News August 17, 2025

HYD: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఓయూ దూరవిద్య కేంద్రంలో ఈ విద్యా సంవత్సరానికి MBA, MCA కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఎలాంటి ఫైన్ లేకుండా వచ్చే నెల 2వ తేదీ వరకు, రూ.500 ఫైన్‌తో 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కాగా సెప్టెంబర్ 7న ఎంట్రెన్స్ పరీక్ష జరగనుంది. టీజీఐసెట్-2025లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ కోర్సుల్లో నేరుగా ప్రవేశం కల్పించనున్నారు.

News August 17, 2025

HYD: వినాయకుడిని తీసుకెళ్లేవారికి సూచనలు

image

ఆరాంఘర్‌ శివారు మార్గంలో శనివారం రోడ్డుపై గణేశ్ విగ్రహం పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే వినాయక చవితి వేళ విగ్రహాల తరలింపుపై జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. చిన్న విగ్రహాలను ట్రక్కులో తరలించాలని, పెద్ద విగ్రహాల కోసం ట్రాక్టర్లు లేదా ప్రత్యేక వాహనాలను ఉపయోగించాలని చెబుతున్నారు. ప్రయాణ సమయంలో విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.