News November 15, 2024
గోల్కొండ కోటలో ‘ఆకలి’
500 ఏళ్ల నాటి గోల్కొండ కోటను చూడటానికి వెళితే ఆకలితో అలమటించాల్సిందే. ఎంతో ఆశతో కోటను చూడటానికి వెళ్లిన పర్యాటకులకు అక్కడ తినడానికి ఏమీ దొరకదు. కోట లోపల కేవలం ఐస్ క్రీమ్స్, వాటర్ బాటిల్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. బయటి నుంచి ఆహారం తీసుకెళ్లేందుకు కూడా అనుమతి లేదు. కోట చుట్టూ తిరగడానికి కనీసం నాలుగు గంటలు పడుతుంది. అధికారులు ఇప్పటికైనా ఈ విషయం గురించి ఆలోచించాలని పర్యాటకులు కోరుతున్నారు.
Similar News
News November 15, 2024
కీసర గుట్టకు ప్రత్యేక జిల్లా బస్సులు
కీసర గుట్టకు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి నుంచి సిటీ బస్సులే కాకుండా వికారాబాద్, వరంగల్, సిద్దిపేట సహా పలు జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. మరోవైపు నగరం నుంచి ఆర్టీసీ స్పెషల్ బస్సులను కూడా అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఈ ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే కీసర గుట్ట వద్ద భక్తులు బారులు తీరారు.
News November 15, 2024
HYD: రాత్రిళ్లు మహిళల అసభ్య ప్రవర్తన.. హెచ్చరిక
హైదరాబాద్‌లోని ప్రధాన సర్కిళ్లలో పురుషుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. తాజాగా చైతన్యపురి PS పరిధిలో రాత్రి సమయంలో దారిన పోయే వ్యక్తులను ఇబ్బంది పెడుతున్న 9 మంది మహిళలను సరూర్‌నగర్ తహశీల్దార్ ముందు పోలీసులు హాజరుపరిచారు. ఇక మీదట ఇలా ప్రవర్తిస్తే రూ.2 లక్షల జరిమానా, 2 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని MRO హెచ్చరించారు.
SHARE IT
News November 15, 2024
కార్తీకపౌర్ణమి: HYDలో అంతా శివోహం!
కార్తీకపౌర్ణమి సందర్భంగా HYDలో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. దీపాలు వెలిగించి స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని ఆలయాల్లో లింగాలను అందంగా అలంకరించారు. శివుడికి రుద్రాభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. కీసర, శ్రీశైలం స్వామివార్లను దర్శించుకునేందుకు వందలాది మంది నగరం నుంచి బయల్దేరుతున్నారు.