News January 12, 2026

గోల్డెన్ గ్లోబ్ అవార్డుల విజేతలు వీరే..

image

లాస్ ఏంజెలెస్‌లో 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక అట్టహాసంగా జరుగుతోంది. బెస్ట్ యాక్టర్-తిమోతీ చలామెట్‌(మార్టీ సుప్రీం), బెస్ట్ డైరెక్టర్‌-పాల్ థామస్ అండర్సన్(వన్ బాటిల్ ఆఫ్టర్ అనెదర్), బెస్ట్ సినిమాటిక్ & బాక్సాఫీస్ అచీవ్‌మెంట్-(సిన్నర్స్), బెస్ట్ యానిమేటెడ్ మోషన్ పిక్చర్‌-KPop డెమన్ హంటర్స్, బెస్ట్ ఫీమేల్ యాక్టర్‌-రోజ్ బిర్నే(If I Had Legs I’d Kick You) అవార్డులు గెలుచుకున్నారు.

Similar News

News February 6, 2026

పచ్చిపేడను ఎలా మగ్గబెడితే మంచిది?

image

ముందుగా పశువుల నుంచి వచ్చే పేడను ఒక దగ్గర వేయాలి. అందులో కాస్త తేమ ఉండేందుకు కొద్దిగా నీళ్లను చల్లుతూ ఉండాలి. పేడ బాగా మగ్గాలంటే కుప్పపై గాలి చొరబడకుండా ప్లాస్టిక్ కవరును గట్టిగా కప్పి ఉంచాలి. ఇలా 2 నుంచి 3 నెలల పాటు ఉంచి మధ్యలో అప్పుడప్పుడు కుప్పను పైకి కిందకు తిరగేయాలి. దీని వల్ల ఎరువు సమానంగా కుళ్లి మగ్గుతుంది. ఇలా బాగా మగ్గిన పశువుల ఎరువును వాడితే నేలసారం పెరిగి అధిక దిగుబడులు వస్తాయి.

News February 6, 2026

కాలతన్నితే పెరిగేది పుచ్చకాయ, కుళ్లేది గుమ్మడికాయ

image

పుచ్చ పంటను సాగు చేసేటప్పుడు కాయ తీగను కాలితో తంతే అది మరింత బలంగా వ్యాపిస్తుందని ఒక నమ్మకం. అదే గుమ్మడికాయకు చిన్న దెబ్బ తగిలినా లోపల కుళ్లి పోతుందట. నిజ జీవితంలో కూడా కొందరు వ్యక్తులు కష్టాలు, విమర్శలు ఎదురైనా వాటిని సానుకూలంగా మార్చుకొని పుచ్చకాయలా మరింత ఉత్సాహంతో ఎదుగుతారు. మరి కొందరు వ్యక్తులు చిన్నపాటి కష్టాలకే గుమ్మడికాయలా కుంగిపోయి, ధైర్యం కోల్పోతారని ఈ సామెత చెబుతుంది.

News February 6, 2026

శుక్ర జపంతో శుక్ర దోషం దూరం!

image

శుక్ర జపం అంటే శుక్రుడికి సంబంధించి ‘ఓం శుక్రాయ నమః’ అనే మంత్రాన్ని పఠించే ప్రక్రియ. ఇది మనస్సును శాంతపరుస్తుంది. ఈ జప సాధనతో మెదడులోని ఆందోళనలు తగ్గుతాయి. సహనం పెరుగుతుంది. ప్రేమ గుణం వృద్ధి చెందుతుంది. క్రమం తప్పకుండా ఈ మంత్రాన్ని జపిస్తే జాతకంలోని శుక్రుడి ప్రభావం బలపడుతుందని నమ్మకం. సంబంధ బాంధవ్యాల్లో మధురత పెరుగుతుందని చెబుతారు. మానసికంగా సిద్ధం చేసి, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనేలా చేస్తుంది.